Big Stories

TVS iQube New Variants: బడ్జెట్ ధరలో టీవీఎస్ క్యూబ్ నుంచి మరో మూడు కొత్త వేరియంట్లు.. ఫీచర్లు మాత్రం అదుర్స్..!

New Variants Launched from TVS iQube: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్‌కు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా తన దైన శైలిలో దూసుకుపోతోంది. అందులోనూ కూబ్య్ (iQube)తో టీవీఎస్ మోటార్స్ సేల్స్ గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. అందువల్ల టీవీఎస్ కంపెనీ TVS iQubeలో కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. అందులో మూడు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది.

- Advertisement -

ఈ కొత్త వేరియంట్లతో ఇప్పుడు ఈ క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాగా ఈ టీవీఎస్ క్యూబ్ కొత్త మోడళ్లు 3.04 KWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ కొత్త TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశవ్యాప్తంగా మొత్తం 434 నగరాల్లోని కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

కాగా టీవీఎస్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సరసమైన ధరతో ప్రారంభించింది. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ 2.2 KWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ వేరియంట్‌కు ఫుల్‌గా ఛార్జింగ్‌ పెడితే దాదాపు 75 కి.మీల రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 75 కి.మీ అని పేర్కొంది. ఇక దీని ధర విషయానికొస్తే.. కంపెనీ దీని ధరను రూ.94,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ వేరియంట్ వాల్‌నట్ బ్రౌన్, పెరల్ వైట్ కలర్స్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది 5 అంగుళాల TFT డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌, వెహికల్ క్రాష్, టో అలర్ట్‌తో సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 2 గంటల్లో 80 శాతం ఛార్జ్ చేయబడుతుంది.

Also Read: టీవీఎస్ ఐక్యూబ్ నుంచి కొత్త వేరియంట్లు.. త్వరలో లాంచ్..!

మరొక వేరియంట్ TVS iQube ST.. ఈ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రెండు బ్యాటరీ ప్యాక్ సామార్థ్యాలతో అందుబాటులోకి వచ్చింది. ఇది 3.4 KWh కెపాసిటీ బ్యాటరీ సామార్థ్యంతో వచ్చింది. దీని ధర రూ. 1,55,555 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీనికి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే 100 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 78 కి.మీగా ఉంది. ఈ iQube ST టైటానియం గ్రే మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్‌ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇది 7 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే, వాయిస్ అసిస్ట్ & అలెక్సా స్కిల్‌సెట్, 118+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

దీంతోపాటు మరో TVS iQube ST వెర్షన్ 5.1 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వెర్షన్ రూ. 1,85,373 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. దీనికి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఇది 150 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీగా ఉంది. ఇందులోని 950W ఛార్జర్‌ ఉంటుంది. ఈ వెర్షన్ 7 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే, వాయిస్ అసిస్ట్ & అలెక్సా స్కిల్‌సెట్, 118+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు వంటి డజన్ల కొద్ది ఫీచర్లను కలిగి ఉంది. దీనిని టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్‌ ఆప్షన్లలో కొనుక్కోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News