BigTV English

Rain Alert to Telangana: మరో రెండు రోజుల వరకు హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం..

Rain Alert to Telangana: మరో రెండు రోజుల వరకు హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం..

Telangana Weather Updates : గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు.. సాయంత్రం, రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు వర్షం, ఈదురుగాలు. ఈ భిన్న వాతావరణం దాదాపుగా వారం రోజుల నుంచి కొనసాగుతోంది. వర్షాలు కురుస్తున్నా పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసిన విషయం తెలిసిందే.


అయితే, తాజాగా వాతావరణ శాఖ మరో శుభవార్త చెప్పింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్లా భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్లా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.

ఈనెల 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో నేడు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో పలు చోట్లా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలో నేడు, రేపు, ఎల్లుండి రాత్రి సమయంలో జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.


Also Read: Bandi sanjay comments: సంజయ్ కామెంట్స్, ఫలితాల తర్వాత కేసీఆర్…

కాగా, సోమవారం ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈదురుగాలుల కారణంగా కోపర్ లోని సమతా నగర్ లో భారీ హోర్డింగ్ మీద పడి 14 మంది మృతి చెందగా, సుమారు 60 మందికి పైగా గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీశారు. అయితే, కూలిన ఆ భారీ హోర్డింగ్ ను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారని ముంబై నగర పాలక సంస్థ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ

అదేవిధంగా వడాలాలో కూడా ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×