BigTV English

Most Middle Class Bikes: రచ్చ రచ్చే.. రూ.60,000 వేలలో 70 కి.మీ పైగా మైలేజీ ఇచ్చే బైకులు ఇవే.. !

Most Middle Class Bikes: రచ్చ రచ్చే.. రూ.60,000 వేలలో 70 కి.మీ పైగా మైలేజీ ఇచ్చే బైకులు ఇవే.. !

Most Middle Class Bikes Under Rs 60,000: దేశీయ మార్కెట్‌లో ఆటో మొబైల్ రంగం దిన దినాన అభివృద్ధి చెందుతోంది. పలు కంపెనీలు కొత్త కొత్త వాహనాలను మార్కెట్‌లో లాంచ్ చేసి అధిక సేల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అలాంటి సమయంలో సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీలు తక్కువ ధర, ఎక్కువ మైలేజీ కలిగిన బైక్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.


దీంతో కొన్ని కంపెనీలు కేవలం అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలో అధిక మైలేజీ ఇచ్చే బైక్‌లను తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా అతి తక్కువ ధలో 70కి పైగా మైలేజీ ఇచ్చే బైక్‌ను కొనుక్కోవాలనుకుంటే బజాజ్ ప్లాటినా, TVS స్పోర్ట్ బైక్‌లు రెండూ సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Bajaj Platina 100: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో మొబైల్ మార్కెట్‌లో దుమ్ము దులిపేస్తుంది. కొత్త కొత్త వాహనాలను తక్కువ ధరలో లాంచ్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సేల్స్ కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇందులో బజాజ్ ప్లాటినా 100 సామాన్యుల బైక్ అని చెప్పుకోవచ్చు.


Also Read: ఉద్యోగం చేసే మహిళలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ..!

ఇది 102 cc సింగిల్ సిలిండర్ DTS-I ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7.79 బిహెచ్‌పి పవర్, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ విషయానికొస్తే.. ఇది లీటరుకు 72 కిమీల వరకు మైలేజీని ఇస్తుంది. బజాజ్ ప్లాటినా 100 బైక్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. అలాగే ఇది ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌ల ఆప్షన్లను కలిగి ఉంది. ఈ బజాజ్ ప్లాటినా రూ. 61,617 నుండి రూ. 66,440 (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

TVS Sport: టీవీఎస్ కంపెనీకి కూడా మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలో యూత్‌ని అట్రాక్ట్ చేసే పాపులర్ బైక్ ‘స్పోర్ట్’. ఇది సరసమైన ధర, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ 109.7 cc, సింగిల్ సిలిండర్, BS6 ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 8.07 PS పవర్, 8.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడింది. ఈ బైక్ 70 నుంచి 80 కి.మీ మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ కోసం TVS స్పోర్ట్ బైక్‌కు ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అందించబడ్డాయి. ఇందులో 10 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఉంది. ధర విషయానికొస్తే.. దీన్ని రూ. 59,881 నుండి రూ. 71,223 (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ మైలేజ్ బైక్‌లు తేలికగా ఉంటాయి.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×