BigTV English

RCB Captain : ఆర్సీబీ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?

RCB Captain : ఆర్సీబీ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?

RCB Captain KL Rahul : ఐపీఎల్ 2024లో గెలిచింది కోల్ కతా అయినా, ఎన్నో వివాదాలకు, సంచలనాలకు ఈ సీజన్ వేదికైంది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఏకంగా గ్రౌండులోకి వెళ్లి.. తిట్టిన తిట్టు తిట్టకుండా నోటికొచ్చినట్టు తిట్టాడు.


ఒక ఫ్రాంచైజీ ఓనర్ అలా జట్టు కెప్టెన్ ని పట్టుకుని తిట్టడంపై నెట్టింట దుమారం రేగింది. తర్వాత దాన్ని చల్లార్చడానికి సంజీవ్ గోయెంకా ఒక పార్టీ ఇచ్చి, దానికి కేఎల్ రాహుల్ ని గెస్ట్ గా పిలిచి, సారీ చెప్పి సముదాయించాడు. అయితే అక్కడితో కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ విరిగిన మనసులు మళ్లీ అతకవు అనే నానుడి నిజమయ్యేలాగే ఉంది.

వచ్చే ఐపీఎల్ మెగా వేలంలోకి కేఎల్ రాహుల్ వచ్చేలా కనిపిస్తున్నాడు. తను లక్నోని వదిలిపెట్టడం ఖాయమని అంటున్నారు. అందుకు టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా మాటలు బలాన్నిస్తున్నాయి. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్ 2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ రానున్నాడ‌ని మిశ్రా తెలిపాడు. ల‌క్నో ఫ్రాంచైజీ మాత్రం రాహుల్ పై అసంతృప్తితో ఉంద‌ని అన్నాడు. దీంతో నెట్టింట ఒక్కసారి మాటలు వైరల్ అయ్యాయి.


Also Read : ఫైనల్ మ్యాచ్ లో మూడు పార్శ్వాలను చూశాను: అక్షర్ పటేల్

ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌రపున మిశ్రా ఆడుతున్నాడు. అయితే 2024లో తనకి పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు రాహుల్ కారణమని భావిస్తూ, తన అక్కసు వెళ్లగక్కాడని కొందరు అంటున్నారు. కానీ అంత గొడవ జరిగాక రాహుల్ కూడా అక్కడ ఉండటం సరికాదని అంటున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ నుంచి రాహుల్ కి పిలుపు వచ్చిందని అంటున్నారు. వాళ్లు ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్ కి ఉద్వాసన పలకనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆర్సీబీలో కూడా హేమాహేమీలు ఉండి కూడా, సరైన నాయకుడు లేకపోవడంతో ఇన్నాళ్లూ ట్రోఫీకి దూరమైపోయింది. ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్లు అందరూ అక్కడ ఉన్నారు. కానీ ట్రోఫీ గెలవడంలో విఫలమవుతోంది. ప్రతీ సీజన్ లో కోహ్లీ ఒక్కడు ఎంతమాత్రమని ఆడతాడని అందరూ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా ఫ్రాంచైజీలకు కెప్టెన్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×