LIC BIMA Lakshmi: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన కస్టమర్ల కోసం రెండు కొత్త బీమా పాలసీలను అక్టోబర్ 15న ప్రారంభించింది. జన సురక్ష(ప్లాన్ 880), బీమా లక్ష్మి(ప్లాన్ 881) అనే రెండు కొత్త పాలసీలను ప్రారంభించినట్లు ఎల్ఐసీ తెలిపింది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించే విధంగా పాలసీలను రూపొందించినట్లు ఎల్ఐసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం ‘జన సురక్ష’ పాలసీ, మహిళల కోసం ‘బీమా లక్ష్మి’ పాలసీ తీసుకొచ్చింది. ఈ రెండు పాలసీలు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ కేటగిరీ కిందకు వస్తాయి. అంటే వాటికి మార్కెట్ లేదా బోనస్‌తో ఎలాంటి సంబంధం ఉండదని ఎల్ఐసీ తెలిపింది.
ఎల్ఐసీ జన్ సురక్ష పాలసీ దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. చాలా సులభమైన ప్రీమియంతో చెల్లింపులు ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లోని ప్రజలు దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా కవరేజీని పొందే సూక్ష్మ బీమా పాలసీ.
ఎల్ఐసీ మహిళల కోసం తీసుకొచ్చిన మరో పాలసీ బీమా లక్ష్మి. ఇది జీవిత బీమా, సేవింగ్స్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ జీవిత బీమా పాలసీ. ఇందులో బోనస్‌లు మార్కెట్‌తో సంబంధం పొందవచ్చు. పెట్టుబడిదారులు నిర్దేశిత విధానంలో రాబడిని పొందుతారు. ఈ ప్లాన్ దీర్ఘకాలిక పొదుపుతో పాటు లైఫ్ కవర్ కోరుకునే కస్టమర్లకు ఉపయోగపడుతుంది. మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా రాబడి పొందవచ్చు. ఈ పాలసీలో మూడు రకాల ఆప్షన్‌లు ఉంటాయి. కస్టమర్ ఎంచుకున్న ఆప్షన్ బట్టి హామీ మొత్తాన్ని విడతల వారీగా పొందవచ్చు.
Also Read: Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?