Amazon Jobs: అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక సార్లు లేఆఫ్స్ ప్రకటించి.. ఆచరించి చూపించిన ఈ కంపెనీ.. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం ఉద్వాసనలు HR డిపార్ట్‌మెంట్‌లో ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటికే అనేక విభాగాల్లో లేఆఫ్స్..
ఈ ఏడాదిలో నాలుగుసార్లు లేఆఫ్స్ చేపట్టింది. అనేక డిపార్ట్‌మెంట్‌లలో ఈ లే ఆఫ్స్ కొనసాగగా.. అమెజాన్ బుక్ బిజినెస్‌లో కూడా లేఆఫ్స్ కొనసాగాయి. డివైజ్‌లు, సర్వీస్ గ్రూప్, కమ్యూనికేషన్ యూనిట్స్ ఇలా అన్నింటిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ వచ్చింది. ఇలా తొలగించిన ఉద్యోగులను AI రీప్లేస్ చేయనుందనేది సమాచారం.
100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం..
అమెజాన్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఈ రంగాలపై ఏకంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధమైంది అమెజాన్. నిజానికి ఈ విషయాన్ని అమెజాన్ ఉద్యోగులకు ఇప్పటికే తెలిపింది. కంపెనీలో చాలా మార్పులు రాబోతున్నాయని..
నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లపై అమెజాన్ ఫోకస్..
నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని.. కంపెనీ రీడెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ మార్పు కంపెనీ భవిష్యత్తుకోసమే అని ప్రకటించింది. నిజానికి ఈ ప్రకటనలో ఓ చిన్న వార్నింగ్ కూడా ఉందనే చెప్పాలి. ఈ స్థాయిలో మార్పు అంటే చాలా ఉద్యోగులకు కోత అన్నట్టే. కానీ ఈ మార్పును తట్టుకొని నిలబడ్డవారు కంపెనీకి చాలా కీలకం అనుకోవాలనే చెప్పాలి.
2022-23 మధ్య 27 వేల మంది ఉద్యోగుల తొలగింపు
2022-23 మధ్య 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్. ఆ సమయంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు అని తెలిపింది. ఆ తర్వాత అడపా దడపా ఈ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అదే బాటలో కొనసాగుతోంది.
Also Read: బైక్ పార్కింగ్ గొడవ.. 30 మందితో హాస్టల్ యువకులు ఇంట్లోకి చొరబడి.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. వైట్ కాలర్ ఉద్యోగులను తొలగిస్తున్నా.. సాధారణ ఉద్యోగులను మాత్రం తీసుకుంటోంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న వేర్‌హౌస్‌లో పని చేసేందుకు ఈ ఏడాది 2 లక్షల 50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటామని ప్రకటించింది అమెజాన్.