Diwali Gold: ఈ దీపావళికి మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు కేవలం రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయవచ్చు. అందుకు మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1.2 లక్షలు ఖర్చు చేసే బదులు మీరు 9 క్యారెట్ల బంగారం ఎంచుకోవడం ద్వారా మీరు కేవలం రూ.41,000 కొనుగోలు చేయవచ్చు.
9 క్యారెట్ల బంగారానికి కూడా BIS హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. దీంతో 9 క్యారెట్ల బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిపై BIS హాల్ మార్కింగ్ ఉంటుంది. ప్యూరిటీలో ఎలాంటి మార్పు ఉండదు.
9 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే ముందు ఈ 3 విషయాలను మీరు తనిఖీ చేయాలి.
- BIS హాల్ మార్క్- ఈ స్టాంప్ ఉందో లేదో నిర్ధారించుకోండి
- ప్యూరిటీ మార్క్ – 9 క్యారెట్ల బంగారానికి 375, 22 క్యారెట్లకు916, 24 క్యారెట్లకు 999 ఉంటుంది.
- హెచ్.యు.ఐ.డి – దీని ప్రామాణికత కోసం BIS కేర్ యాప్‌లో చెక్ చేయవచ్చు.
2025లో బంగారం ధరలు దాదాపు 60 శాతానికి పైగా పెరిగాయి. ధన త్రయోదశికి బంగారం కొనడం ఒక సంప్రదాయం. దీపావళి పండుగ సీజన్ లో ఏదొక రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ సంవత్సరం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల కొంతమంది గోల్డ్ ను సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నారు.
ధనత్రయోదశికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, కొనుగోలు చేసే ముందు ఏం తనిఖీ చేయాలి వాటిపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
బంగారం కొనుగోలుకు ముందు ఏం తనిఖీ చేయాలి?
- బంగారాన్ని కొనుగోలు చేసే ముందు, మీరు రెండు విషయాలను తనిఖీ చేయాలి. అదే ధర, స్వచ్ఛత. బంగారం ధరలు పెరగడం వల్ల కొనుగోలు ఎక్కువగా ఉండడంతో కొంతమంది ఆభరణాల వ్యాపారులు వాస్తవ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. అందుకే కొనుగోలు ముందు వివిధ షాపుల్లో బంగారం ధరలను పోల్చి చూసుకోండి. స్వచ్ఛమైన బంగారు నాణేలను విక్రయించే కొన్ని మంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ ధరలు, డిస్కౌంట్ ఆఫర్‌లు తనిఖీ చేయవచ్చు.
- బంగారం ధర క్వాలిటీ బట్టి మారుతుంది. 24 క్యారెట్ల బంగార ఆభరణాల ధర, 18 క్యారెట్లు లేదా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు భిన్నంగా ఉంటుంది. మీరు కొనుగోలు చేసే బంగారం ఎన్ని క్యారెట్లు ముందుగా నిర్ధారించుకోండి.
- BIS హాల్‌మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయండి. BIS కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాల ప్రామాణికతను చెక్ చేయవచ్చు.
- హాల్‌మార్క్‌తో పాటు, బంగారు ఆభరణాల ప్యూరిటీని పరీక్షించడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. మాగ్నెట్ పరీక్ష, నీటి పరీక్ష, యాసిడ్ పరీక్ష, స్కిన్ పరీక్ష, XRF స్పెక్ట్రోమీటర్ పరీక్ష ద్వారా గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయవచ్చు. వీటితో పాటు మేకింగ్ ఛార్జీలు, పూర్తి వివరాలతో బిల్లు, కొనుగోలు విధానం, జీఎస్టీ, ఇతర ఛార్జీలు తనిఖీ చేసుకోవాలి.
Also Read: Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?
Declaimer : ఈ ఆర్టికల్ లోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఈ సమాచారాన్ని బిగ్ టీవీ ధ్రువీకరించలేదు.

Share