E-Paper
Advertisement

Egg Price Hike: డజను గుడ్లు రూ.90.. ఎందుకింత ధర పెరిగింది?

Egg Price Hike: డజను గుడ్లు రూ.90.. ఎందుకింత ధర పెరిగింది?
Advertisement

Eggs Prices: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఓ గుడ్డు తించే శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయంటున్నారు. గుడ్డు శాకాహారం కావడంతో అందరూ తినొచ్చని చెప్తారు. ఇందులోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది కావడంతో చాలా మంది పోషకాహార నిపుణులు. శరీరానికి ఎంతో మేలు చేసే గుడ్ల ధరలు గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటుతున్నాయి.  గుడ్లు కొనాలంటనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

రికార్డు ధర పలుకుతున్న గుడ్ల ధరలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల రేట్లు ఎప్పుడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి.  ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా రూ. 8 నుంచి 9 వరకు పలుకుతుంది. హోల్ సేల్ సెంటర్లలో ఒక ట్రే(30) గుడ్లకు రూ. 200 నుంచి రూ. 210 తీసుకుంటున్నారు.  హోల్‌ సేల్ మార్కెట్లలో 100 గుడ్ల క్రేట్ దాదాపు రూ.670 నుంచి రూ. 700 పలుకుతుంది.  హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీనగర్ తో పాటు విశాఖపట్నం, చిత్తూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో హోల్‌ సేల్ ధరలు ఒక్కో క్రేట్‌కు సుమారు రూ. 700గా ఉంది. రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డు రూ. 7 నుంచి రూ.9 వరకు అమ్ముతున్నారు. మొత్తంగా గుడ్ల ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.

Advertisement

Read Also: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!

గుడ్ల రేట్లు ఎందుకు ఇంతగా పెరిగాయింటే?      

తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల రేట్లు విపరీతంగా పెరడగానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు ఫౌల్ట్రీ యజమానాలు. ప్రస్తుతం  రాష్ట్రాల్లో చలితీవ్రత పెరగడంతో అక్కడ గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతానికి గుడ్ల ఎగుమతి పెద్ద సంఖ్యలో పెరిగింది. అదే కాకుండా, కొద్ది వారాల క్రితం మొంథా తుఫాన్ ప్రభావం పౌల్ట్రీ రంగం మీద భారీగా పడింది. ఏపీ, తెలంగాణ లోని చాలా చోట్ల కోళ్లు చనిపోయాయి. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి తగ్గింది. అదే సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ కారణాలతో గుడ్ల సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది. ఫలితంగా గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటున్నారు నిపుణులు. చికెన్ ధరలు తక్కువగా ఉండటం, గుడ్ల ధరలు పెరడం పట్ల వినియోగదారులు, గుడ్ల కంటే చికెన్ తీసుకెళ్లడమే బెస్ట్ అని భావిస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లోనే పౌల్ట్రీ రంగం సెట్ రైట్ అవుతుందని, గుడ్ల ధరలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Read Also: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×