E-Paper
Advertisement

ప్రపంచానికి ‘చమురు సెగ’.. మళ్లీ లాక్‌డౌన్ చీకట్లోకి దేశాలు.. మరి భారత్ సంగతేంటి?

ప్రపంచానికి ‘చమురు సెగ’.. మళ్లీ లాక్‌డౌన్ చీకట్లోకి దేశాలు.. మరి భారత్ సంగతేంటి?

Global Energy Crisis: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన సంక్షోభం (Energy Crisis) ముదురుతోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పలు దేశాలు ఇప్పటికే ‘ఎనర్జీ లాక్‌డౌన్’ దిశగా అడుగులు వేస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ కు పిలుపునిచ్చారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? భారత్ లో నెలకొన్న పరిస్థితి ఏంటి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి?

కరోనా సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంధనాన్ని ఆదా చేసేందుకు పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీనినే నెట్టింట ‘ఎనర్జీ లాక్‌డౌన్’ అని పిలుస్తున్నారు. ముడి చమురు దిగుమతులు తగ్గిపోవడం, ధరలు పెరగడంతో రవాణా వ్యవస్థపై భారం పడకుండా ఉండేందుకు దేశాలు ప్రజల కదలికలపై స్వచ్ఛంద లేదా నిర్బంధ నియంత్రణలు విధిస్తున్నాయి.

ఆంక్షలు విధించిన దేశాలు..

చమురు వినియోగాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు ఇప్పటికే కార్యాలయాలకు సెలవు ప్రకటించి.. ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించాయి. దాయాది దేశం పాకిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రకటించి.. మిగిలిన రోజుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. అటు బంగ్లాదేశ్ సైతం ఇంధన పొదుపు కోసం పాఠశాలలను మూసివేసి.. ఆఫీసు పనివేళలను కుదించింది. ఈజిప్ట్ సైతం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వారానికి ఒకరోజు కచ్చితంగా ఇంటి నుండే పని చేయాలని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. థాయిలాండ్, మలేషియా దేశాలు కూడా అనవసర ప్రయాణాలను తగ్గించాలని, వర్చువల్ మీటింగ్స్ నిర్వహించాలని తమ దేశాల్లోని ఐటీ, ఇతర సంస్థలకు సూచించాయి.

భారత్‌లో ప్రస్తుత పరిస్థితేంటి?

భారత్ తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని కీలక సూచనలు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని కోరారు. ఐటీ సంస్థలు, ప్రైవేటు ఆఫీసులు మళ్లీ కరోనా కాలం నాటి వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు విదేశీ ప్రయాణాలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోళ్లను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బంగారం కొనుగోళ్లు చేసేవారు లేక పసిడి షాపులు వెలవలబోతున్నాయి. మరోవైపు తమ కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకునేందుకు ఏపీ వంటి రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. దిల్లీ సీఎం రేఖా గుప్తా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ను సైతం ప్రకటించారు.

Also Read: UP Rains: విరుచుకుపడ్డ వర్షాలు.. ఏకంగా 100 మంది మృత్యువాత.. సీఎం తీవ్ర భావోద్వేగం

మళ్లీ లాక్‌డౌన్ వచ్చే ఛాన్స్ ఉందా?

అయితే ప్రస్తుతానికి భారత్‌లో అధికారికంగా ఎలాంటి నిర్బంధ ఎనర్జీ లాక్‌డౌన్ ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోతే మాత్రం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చమురు ధరల పెంపు, పెట్రోల్ బంకుల్లో చమురు విక్రయంపై ఆంక్షలు, సొంత వాహనాల ప్రయాణంపై నియంత్రణలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రాలు చమురు లాక్ డౌన్ ను విధిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ లను పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలకు సూచించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెుత్తం మీద ప్రస్తుతానికి ఎనర్జీ లాక్ డౌన్ సంకేతాలు దేశంలో లేనప్పటికీ.. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందని మాత్రం చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: ‘ముందు బాధితురాలి వయసు తేల్చండి’.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×