BigTV English

EPFO monthly pension: నెలజీతం రూ.15000 ఉన్నా.. పెన్షన్ రూ.10000 పొందొచ్చు.. ఎలాగంటే..

EPFO monthly pension: నెలజీతం రూ.15000 ఉన్నా.. పెన్షన్ రూ.10000 పొందొచ్చు.. ఎలాగంటే..

EPFO monthly pension| ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులకు ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం.. ప్రతి సభ్యుడు నెల పెన్షన్ రూ.10000 పొందవచ్చు. బేసిక్ సాలరీ రూ.15000 ఉన్నా రూ.10000 ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పథకం ద్వారా లాభాలు పొందాలంటే.. కనీసం 10 సంవత్సరాలు ఇందులో పెట్టబడి పెట్టాలి. 58 ఏళ్లు పైబడిన సభ్యులకు ఈ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది.


బేసిక్ సాలరీ లిమిట్ పెంచే యోచనలో కేంద్రం
నిత్యావసరాల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ఈపిఎఫ్‌వో బేసిక్ పే లిమిట్ రూ.15000 నుంచి రూ.21000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర లేబర్ మంత్రి మన్‌సుఖ్ మాండవియా సూచించారు. 2025 సంవత్సరం నుంచి బేసిక్ సాలరీ పెరిగే అవకాశం ఉంది.

తక్కువ జీతం ఉన్నా ఒక ఉద్యోగి ప్రతినెలా రూ.10000 పెన్షన్ ఎలా పొందవచ్చో తెలుసుకోండి.


Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

ఉదాహరణకు మోహన్ అనే వ్యక్తి జనవరి 2015లో ఉద్యోగంలో చేరితే.. కంపెనీ ఆ సమయంలో అతనికి బేసిక్ సాలరీ రూ.15000 గా నిర్ణయించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 నుంచి బేసిక్ సాలరీ కనీసం రూ.21000 ఉండాలని నిబంధన చేస్తే.. మోహన్ 35 ఏళ్లు ఉద్యోగం చేసిన తరువాత అతనికి పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది.
ప్రతినెల రూ.10000 పెన్షన్ ఎలా పొందాలో ఫార్ములా ప్రకారం చూద్దాం.

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపిఎస్) = యావరేజ్ పెన్షనబుల్ సాలరీ * పెన్షనబుల్ సర్వీస్/70
ఉదాహరణకు మోహన్ సర్వీస్ మొదటి భాగం చూస్తే.. జనవరి 2015 నుంచి డిసెంబర్ 2024 పదేళ్లు పూర్తవుతుంది. దీంతో బేసిక్ పే లిమిట్ రూ.15000. మోహన్ రెండో పార్ట్ సర్వీస్ లో జనవరి 2025 నుంచి డిసెంబర్ 2049 (25 సంవత్సరాలు).. బేసిక్ పే లిమిట్ రూ.21000.

పార్ట్ -1 లెక్క ప్రకారం.. పదేళ్ల పెన్షన్ యావరేజ్ పెన్షనబుల్ సాలరీ రూ.15000, పెన్షనబుల్ సర్వీస్ – 10 సంవత్సరాలు

పెన్షన్ = Rs 15,000×10/70 = Rs 2,142.86 (ప్రతి నెల) వస్తుంది.

పార్ట్ – 2 లెక్క ప్రకారం.. 25 సంవత్సారాలకు పెన్షన్ కాలికులేట్ చేయాలి. యావరేజ్ పెన్షనబుల్ సాలరీ రూ.21000, పెన్షనబుల్ సర్వీస్ – 25 సంవత్సరాలు

పెన్షన్ = Rs 21,000×25/70 = Rs 7,500 ప్రతినెలా వస్తుంది.

ఈ లెక్కన 35 ఏళ్ల సర్వీస్ తరువాత మోహన్ మొత్తం పెన్షన్ చూస్తే.. నెలకు Rs 2,142.86 + Rs 7,500 = Rs 9,642.86 వస్తుంది. మోహన్ రిటైర్ అయిన తరువాత అతనికి పెన్షన్ రూ.10000 ప్రతి నెలా అందుతుంది.

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×