Riyan Parag’s bizarre Malinga attempt fails miserably, ends up in rare no-ball : టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య…బుధవారం జరిగిన మ్యాచ్లో.. సూర్య కుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ జట్టు పైన ఏకంగా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో రాణించాడు నితీష్ కుమార్.
Also Read: IPL 2025: SRH లో కల్లోలం..ఆ డేంజర్ ప్లేయర్ ఔట్ ?
అయితే ఈ మ్యాచ్లో ఓ అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియాలో ఇటీవల చోటు దక్కించుకున్న యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్… ఓవరాక్షన్ చేశాడు. బౌలింగ్ చేయమంటే చేయకుండా… నోబాల్ వేసి అందరినీ… షాక్ నకు గురి చేశాడు. బంగ్లాదేశ్ వికెట్లు వరుసగా పడుతున్న నేపథ్యంలో… పరాగ్… వేసిన ఓ బంతి… క్రీడాభిమానులకు షాక్ తెప్పించింది.
ఈ సంఘటన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ లో జరిగింది. 11 ఓవర్ వేయడానికి వచ్చిన పరాగ్… బంగ్లాదేశ్ బ్యాటర్ మహమ్మదుల్లాను ఇబ్బంది పెట్టేందుకు… వెరైటీగా బౌలింగ్ చేయాలని అనుకున్నాడు. వికెట్లకు దూరంగా నడుచుకుంటూ వచ్చి… బంతి సంధించాడు. అయితే… అది గమనించిన అంపైర్… నోబాల్ గా ప్రకటించాడు. దీంతో పరాగ్… ప్లాన్ బేడిసి కొట్టడమే కాకుండా… సూర్య కుమార్ కు కోపం కూడా తెప్పించింది.
Read Also: IND vs BAN: తెలుగోడి ఊచకోత.. బంగ్లాపై టీమిండియా విజయానికి 5 కారణాలు ఇవే !
ఇక అక్కడే ఉన్న టీం ఇండియా ప్లేయర్ లందరూ ఇంత ఓవరాక్షన్ ఎందుకు అన్నట్లుగా…. పరాగ్ వైపు చూశారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు.. 221 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేదనలో బంగ్లాదేశ్ 135 పరుగులు చేసి 86 పరుగుల తేడాతో ఓడిపోయింది.