UPI Payment Charges: డిజిటల్ పేమెంట్స్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. డిజిటల్ చెల్లింపులో అత్యంత ప్రాచుర్యం పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ – UPI లావాదేవీలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల పైబడిన లావాదేవీలపై MDRని 0.4 శాతం లేదా 40 బేసిస్ పాయింట్లుగా ఓకే చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
దేశంలో క్లిక్ అండ్ పే అనగా యూపీఐ సేవలపై కొత్త ఛార్జీలపై ప్రకటన వచ్చేసింది. రూ. 2,000 దాటిన వాటికి పాక్షిక ఛార్జీని వసూలు చేస్తాయని ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే వ్యక్తిగత లావాదేవీలపై ఈ ఛార్జీలను మినహాయించింది. సెప్టెంబర్ 15న సమావేశమైన యూపీఐ స్టీరింగ్ కమిటీ.. రూ. 2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్‌ని 0.4 శాతం లేదా 40 బేసిస్ పాయింట్లు ఓకే చేసింది. సాధారణంగా MDR అనేది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులకు చెల్లించే కమీషన్. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
వినియోగదారులు.. వ్యాపారులతో జరిపే లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీ విధించబడుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్- UPI కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కొత్త నిబంధనలలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఛార్జీ ప్రతి లావాదేవీకి రూ. 300కు పరిమితం చేసింది. ఈ భారాన్ని వ్యాపారులు.. వినియోగదారులపై మోపకుండా చూసుకోవాలని ఆర్థిక శాఖ బ్యాంకులకు సూచన చేసింది.
ప్రతి లావాదేవీకి MDRకు గరిష్ట పరిమితిని రూ.300గా నిర్ణయించింది ఎన్‌పీసీఐ. 0.4 శాతం రేటు ప్రకారం.. రూ. 75 వేల విలువైన లావాదేవీకి రూ.300 MDR వర్తిస్తుంది. ఒకవేళ ఎక్కువ విలువ గల లావాదేవీలు జరిగితే ఆ మొత్తంతో సంబంధం లేకుండా గరిష్టంగా రూ.300 ఉంటుంది. కొత్త విధానం ప్రకారం ఖర్చు చేసే ప్రతి రూ.2 వేలకు రూ.8 లు, UPI ద్వారా చెల్లించే ప్రతి రూ.10 వేలకు రూ.40 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని లెక్క గట్టారు. వ్యాపారుల నుంచి బ్యాంకులు కమిషన్ తీసుకుంటాయి.
1. రూ.2,000 వరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితం
2. వ్యక్తి నుంచి వ్యక్తికి పంపించే డబ్బుల లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు
3. Google Pay, PhonePe వంటి యాప్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేయవు
4. QR కోడ్ స్కాన్ చేసి షాపుల్లో ఎంత మొత్తం చెల్లించినా వినియోగదారుడికి ఛార్జీ ఉండదు
5. RuPay డెబిట్ కార్డు చెల్లింపులు ఉచితమే
6. UPI Auto Pay, మ్యూచువల్ ఫండ్స్, OTT, కరెంట్ బిల్లుల ఆటో డెబిట్‌లపై MDR ఉండదు
రూ.2,000కు పైబడిన కొన్ని P2M లావాదేవీలపై MDR ఛార్జీలు అమల్లోకి రానుంది. ఎంపిక చేసిన రంగాలు రూ.5 ఉండనుంది. పెట్రోల్ బంకులు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ బిల్లులు, రైల్వేలు, టెలికాం, విద్యా సంస్థల వంటి రంగాల్లో రూ.2 వేల దాటిన లావాదేవీలపై వ్యాపారి చెల్లించాల్సినది రూ.5కు పరిమితం చేసింది. చిన్న, మైక్రో వ్యాపారులకు మినహాయింపులు ఉన్నాయి. నెలకు లక్ష వరకు UPI ద్వారా స్వీకరించే వ్యాపారులకు 0 శాతం MDR వర్తించనుంది. ఈ ఛార్జీలు వినియోగదారులపై కాదని, వ్యాపారులపై ఉంటాయని కేంద్రం చెబుతున్నమాట. ఛార్జీల విషయం తెలియగానే అప్పుడే వ్యాపారులు క్యాష్ ఇవ్వాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
ALSO READ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అప్‌డేట్స్!