job interviews feel like interrogations| ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు మన అనుభవాలు, నైపుణ్యాల, విద్యార్హతల గురించి ప్రశ్నలు అడుగుతారని చాలామంది భావిస్తారు. కానీ దేశంలో చాలామంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వరుస ప్రశ్నలు, కఠినమైన టెక్నికల్ పరీక్షలు, తక్కువ సంభాషణ వారిని ఒత్తిడికి గురిచేస్తాయి. దీంతో ఇంటర్వ్యూ కంటే విచారణ ఎదుర్కొంటున్న భావన కలుగుతుంది.
సాధారణంగా ఇంటర్వ్యూలో అభ్యర్థి అనుభవం, నైపుణ్యాలు, అంచనాలు, ఉద్యోగానికి సరిపోయే సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.
అయితే కొందరు అభ్యర్థులు వరుస ప్రశ్నలతో కూడిన ఇంటర్వ్యూలను ఎదుర్కొంటున్నారు. టెక్నికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి కోడింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని పరీక్షలు.. అసలు చేయబోయే ఉద్యోగంతో సంబంధం లేనట్లు ఉన్నాయని ఎదురయ్యే పరిస్థితులకు దూరంగా ఉంటున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.
భారతీయ టెక్ నిపుణులు ఆకస్మిక ప్రశ్నలు, కఠినమైన ఇంటర్వ్యూయర్ల అనుభవాలను షేర్ చేశారు. ఒక అభ్యర్థి తన పరిచయం చెప్పగానే కోడింగ్ ప్రశ్న ఎదురైందని గుర్తుచేసుకున్నారు. ఇంటర్వ్యూయర్ తనను పరిచయం చేసుకోలేదని, ప్రక్రియను వివరించలేదని ఆయన తెలిపారు. అసలు సమస్య కఠినమైన ప్రశ్నలు మాత్రమే కాదని అభ్యర్థులు అంటున్నారు. ప్రశ్నలు అడిగే విధానం, సందర్భం, అభ్యర్థులతో వ్యవహరించే తీరు కూడా ముఖ్యమే.
ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు అభ్యర్థులను అంచనా వేస్తాయి. అదే సమయంలో అభ్యర్థులు కూడా కంపెనీ సంస్కృతి, పని వాతావరణాన్ని అంచనా వేయాలి. అయితే కొన్నిసార్లు ఈ సమతుల్యత పూర్తిగా కనిపించదు. కొంతమంది రెడిట్ వినియోగదారులు తమ పోస్ట్‌లో.. ఇంటర్వ్యూలు అదనపు బాధ్యతగా భావించి వారు నిర్లక్ష్యంగా ఇంటర్వ్యూ చేస్టున్నట్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు యూజర్లు ఇంటర్వ్యూ చేసేవారు తమ అధికారాన్ని ప్రదర్శించే ప్రక్రియగా అభివర్ణించారు. జీతం గురించి మాట్లాడేటప్పుడు కూడా కొందరు అభ్యర్థులు అసౌకర్యానికి గురయ్యారు.
NGS Global India మేనేజింగ్ పార్ట్‌నర్ ఆశిష్ ధావన్ ఈ సమస్యపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంటర్వ్యూలను విచారణలుగా మార్చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన కూడా అంగీకరించారు.
అభ్యర్థులకు తమ అనుభవాలను వివరించే అవకాశం కూడా ఇవ్వాలని అబిషేక్ ఆనంద్ అన్నారు. ఇంటర్వ్యూ నైపుణ్యాలను పరీక్షించడంతోపాటు అభ్యర్థి ఆలోచనా విధానాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. కఠినమైన ఇంటర్వ్యూ కూడా గౌరవప్రదంగా ఉండవచ్చు. కానీ భయపెట్టే వాతావరణం అభ్యర్థులు తమ అసలు సామర్థ్యాన్ని చూపకుండా చేయవచ్చు.
ఉద్యోగ నియామక ప్రక్రియలో సమస్యలు ఇంటర్వ్యూ గదితోనే ముగియవు.
Indeed 2026 Hiring Confidence Index ప్రకారం భారత్ 100లో 58 స్కోర్ సాధించింది.
ఈ సర్వేలో 1,073 మంది ఉద్యోగార్థులు, 735 మంది ఉద్యోగదాతలు పాల్గొన్నారు.
29 శాతం ఉద్యోగార్థులు కంపెనీలు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో 26 శాతం మంది ఇంటర్వ్యూ రౌండ్ల మధ్య ఆలస్యాలను ప్రస్తావించారు.
20 శాతం మంది సరైన ఫీడ్‌బ్యాక్ లేకపోవడాన్ని సమస్యగా పేర్కొన్నారు.
సంప్రదాయ కోడింగ్ పరీక్షలపై కూడా ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. టైమ్‌డ్ కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ పరీక్షలు వాస్తవ పనిని ప్రతిబింబించకపోవచ్చని అభ్యర్థులు అంటున్నారు.
అందుకే కంపెనీలు సమస్య పరిష్కారం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్‌ను కూడా పరిశీలించాలి. అభ్యర్థులు AIని సమర్థంగా ఎలా ఉపయోగిస్తారనేది కూడా భవిష్యత్తులో ముఖ్యమవుతుంది.
Also Read: SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి
కంపెనీలు ప్రతిభను గుర్తించడానికి కఠినమైన పరీక్షలు నిర్వహించవచ్చు. అయితే అభ్యర్థులను అనవసరంగా ఒత్తిడికి గురిచేయాల్సిన అవసరం లేదు.
మంచి ఇంటర్వ్యూ రెండు వైపులా అర్థవంతమైన సంభాషణకు అవకాశం కల్పించాలి. AI ఉద్యోగాలను మార్చుతున్న సమయంలో నియామక విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంది.