Gold Price Today: బంగారం కొనుగోళ్లదారులకు ఆనందంతో ఎగిరి గత్తేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకూ మార్కెట్లో వాటి ధర తగ్గడమే కారణం. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే బంగారం రేట్లు పతనం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మార్కెట్లో బంగారం-వెండి ధరలను పరిశీలిద్దాం.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బుధవారం అర్ధరాత్రి వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. వడ్డీ రేట్లు తగ్గించాల్సిందేనని అధ్యక్షుడు ట్రంప్ పట్టుబడుతున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కానీ ఫెడ్ ఆలోచన తీరు మరోలా ఉంది. అదే జరిగితే డాలర్ పతనం అవుతుందని ఆలోచన చేస్తోంది. వడ్డీ రేట్లు పెంచితే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి, బంగారం ధరలు తగ్గే అవకాశముంది. దీని ప్రభావం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌పై పడింది. అక్కడ ధర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది.
బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. ఈ వారంలో గడిచిన రెండురోజులు ధర తగ్గింది. ఈ వారమంతా అదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ధరలు నిలకడగా ఉండడంతో మంగళ, బుధవారాల్లో బంగారం ధర దిగొచ్చింది. సెప్టెంబర్ 16న బుధవారం ఉదయం అంతర్జాతీయంగా ధరలు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 4280 డాలర్ల స్థాయిలో ఉంది. మంగళవారం ఔన్సుకు 4300 డాలర్లపైనే ట్రేడ్ అయ్యింది. సిల్వర్ రేటు తగ్గి 63.70 డాలర్ల వద్ద అటు ఇటు కదలాడుతోంది.
ఫలితంగా దేశీయంగా బంగారం ధర దిగొచ్చింది. ముంబైలో 24 క్యారెట్లకు రూ. 1,53,170 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,40,400 వద్ద కొనసాగుతోంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంది. 24 క్యారెట్లు రూ. 1,53,320 కొనసాగుతుండా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 1,40,550 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
బుధవారం ఉదయం 7.30 గంటలకు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 920 తగ్గి 10 గ్రాములు ప్రస్తుతం రూ. 1,53,170 పలుకుతోంది. మంగళవారం రూ. 490 పతనమైంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 850 తగ్గి తులం రూ. 1,40,400 వద్ద ఉంది. మంగళవారం కూడా రూ. 450 మేరా దిగి వచ్చింది. గోల్డ్ రేటు తగ్గినా, వెండి ధర మారలేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ధరలు హెచ్చుతగ్గులకు లోను కానున్నాయి.
ALSO READ: యూపీఐపై కొత్త ఛార్జీలు.. రూ.2 వేలు ధాటితే ఇత్తడే, అంతా వ్యాపారికేనట, క్యాష్ చెల్లింపులే బెటరా?