E-Paper
Advertisement

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ ‌పే యాప్‌లకు ఆదాయం ఎలా వస్తుంది? వీటిలో ఏది బెస్ట్?

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ ‌పే యాప్‌లకు ఆదాయం ఎలా వస్తుంది? వీటిలో ఏది బెస్ట్?
Advertisement

Digital payments India: ఇప్పటివరకు మనం Phone Pay, Paytm, Google Pay యాప్స్ నుంచి ఉచితంగానే డబ్బులు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో ఇది కొనసాగించడం సందేహమే. తాజాగా ప్రభుత్వం రూ.2వేల పైన చెల్లింపులకు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఇది సాధారణ ప్రజలకు వర్తించదు. రూ.2 వేలకు పైబడి చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకే వర్తిస్తుంది. మన తెలివైన వ్యాపారులు ఆ భారాన్ని భరిస్తారని అనుకుంటే అమాయకత్వమే. రూల్స్‌ను కూడా బురిడి కొట్టించి.. ఆ భారం జనాలపైనే మోపుతారు. లేదా క్యాష్ మాత్రమే చెల్లించాలని అడుగుతారు. మరి, ఇన్ని రోజులు.. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటీ? నిజంగానే యూపీఐ యాప్‌లు నష్టాలను ఎదుర్కొంటున్నాయా? అసలు వాటికి ఆదాయం ఎలా వస్తోంది తదితర వివరాలు మీ కోసం.

డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా ఉచితాలు, కానీ ఇప్పుడు…

నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు, నల్లదనం అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించింది. దీని ద్వారా పెద్ద పెద్ద లావాదేవీలపై నిఘా ఉంచడం సులభం అవుతుందని భావించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు UPI యాప్‌ల ద్వారా నిర్వహించే లావాదేవీలను ఉచితం చేసింది. జీరో ఎండీఆర్ (Merchant Discount Rate) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది అక్టోబర్ 14 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తర్వాతి నుంచి రూ.2 వేలు దాటే ప్రతి చెల్లింపునకు ఎండీఆర్ వర్తించనుంది.

ఇన్నాళ్లూ యూపీఐ యాప్‌లు నష్టాలు ఎదుర్కొన్నాయా?

Advertisement

UPI యాప్‌ల్లో ఇప్పటివరకు మనం చేసిన లావాదేవీలన్నీ ఉచితమే. ఇకపై కూడా ఉచితమే. మరి, దాని వల్ల UPI యాప్స్‌కు నష్టం రాదా అనే సందేహం చాలామందిలో ఉంది. డిజిటల్ ఇండియా నినాదం మొదలైన తర్వాత కేంద్రమే స్వయంగా జీరో ఎండీఆర్ విధించింది. దానివల్ల వ్యాపారుల నుంచి బ్యాంకులకు, యాప్‌లకు ఎలాంటి కమీషన్ రాదు. అవి నష్టపోకుండా ఉండేందుకు ఏటా బడ్జెట్‌లో కొన్ని వేల కోట్ల రూపాయలను ఇన్సెంటివ్ స్కీ్మ్స్ రూపంలో నిధులు కేటాయించింది. దీంతో బ్యాంకులు, యాప్‌లు సర్వర్లు, ఇతర నిర్వాహణ పనులు నడిపించేవి. ఇవి కాకుండా ఇతర సర్వీసుల ద్వారా కూడా ఈ యాప్స్‌కు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఏటా సుమారు రూ. 30 లక్షల కోట్ల విలువైన లావాదేవీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా జరుగుతున్నాయి. దీన్ని బట్టి.. ఆ యాప్‌లకు ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కమీషన్లు

పేమెంట్స్ చేయడం ఫ్రీ అయినప్పటికీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ వంటి యూటిలిటీ బిల్లుల చెల్లింపులపై బ్యాంకులు లేదా సర్వీస్ ప్రొవైడర్లు ఈ యాప్‌లకు కమీషన్లు ఇస్తున్నాయి. యాప్ ద్వారా తీసుకునే పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ పెట్టుబడుల ద్వారా వచ్చే కమిషన్లే వీటికి ప్రధాన ఆదాయ వనరులు. ఈ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించినప్పుడు, లోన్స్ కట్టినప్పుడు సంబంధిత బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు ఈ యాప్‌లకు కమీషన్లు ఇస్తాయి. ఈ యాప్‌ల ద్వారా బైక్, కార్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్ కమీషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి.

ప్రకటనలు, ప్రమోషన్లతో మరింత ఆదాయం

Advertisement

కోట్లాది మంది యూజర్లతో నిత్యం యాక్టివ్‌గా వాడే ఈ యాప్‌లకు ప్రకటనలు కూడా భారీగానే వస్తున్నాయి. వాటి హోమ్ స్క్రీన్‌పై కనిపించే బ్రాండెడ్ బ్యానర్లు, పాప్-అప్ యాడ్స్, వివిధ కంపెనీల క్యాష్‌బ్యాక్ కూపన్ల ప్రమోషన్ల కోసం పెద్ద బ్రాండ్లు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాయి. అలాగే కార్పొరేట్, పెద్ద వ్యాపారాల కోసం పెయిడ్ సర్వీసులు కూడా ఈ యాప్‌లు నడిస్తున్నాయి. ఇకపై ఎండీఆర్ ద్వారా ఈ యాప్‌లకు ఆదాయం రానుంది. ఈ యాప్‌లలో చాలావరకు వినియోగదారుల డేటా ఉంటుంది. పైగా అన్నీ డబ్బుతో కూడుకున్న వ్యవహరాలు. అందుకే, వాటిని సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆ యాప్‌లకు ఉంది.

ఫైనాన్షియల్ సర్వీసులతోనూ లాభాలే..

ఇవి కేవలం పేమెంట్ యాప్‌లు మాత్రమే కావు, ఇప్పుడొక పూర్తి స్థాయి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా. ఎందుకంటే.. ఇప్పుడు ఈ యాప్‌లు పర్శనల్, బిజినెస్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. థర్డ్ పార్టీ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుని యూజర్లకు ఇన్‌స్టెంట్ లోన్స్ ఇప్పిస్తున్నాయి. వాటి నుంచి వచ్చే వడ్డీలో కొంత వాటా లేదా ప్రాసెసింగ్ ఫీజు ఈ యాప్‌లకు దక్కుతుంది. అలాగే ఈ యాప్‌లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై కూడా కమీషన్లు వస్తాయి. అలాగే కొన్ని యాప్‌లు పోస్ట్ పెయిడ్ లేదా క్రెడిట్ సేవలను అందిస్తున్నాయి. వీటి ద్వారా యూజర్లు ముందుగా ఖర్చు చేసి.. తర్వాత బిల్లు కట్టే సౌలభ్యం ఉంటుంది. దీనిపై విధించే వడ్డీలు, లేట్ ఫీజుల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది.

ఏ UPI యాప్ తోపు?

ప్రస్తుతం మార్కెట్లో.. ఫోన్ పే(PhonePe), గూగుల్ పే(Google Pay), పేటీఎం(Paytm) యాప్‌లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. బ్యాంక్ యాప్‌లు కూడా నేరుగా యూపీఐ సేవలు అందిస్తున్నా.. ఎక్కువ మంది ఈ యాప్‌లనే ఉపయోగిస్తున్నారు. పేటీఎం కంటే వెనుక వచ్చిన ఫోన్‌పే ఇప్పుడు యూపీఐ యాప్‌ల్లో తోపుగా నిలిచింది. ప్రస్తుత గణంకాలను పరిశీలిస్తే.. మార్కెట్లో పేటీఎం సంస్థ సుమారు 45 నుంచి 47 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. 33 నుంచి 34 శాతం వాటాతో గూగుల్ పే రెండో స్థానంలో ఉంది. 7 నుంచి 8 శాతం వాటాతో పేటీఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. వీటితోపాటు నవీ (Navi), క్రెడ్ (CRED), సూపర్‌.మనీ (super.money). ప్రభుత్వానికి చెందిన భీమ్ (BHIM) యాప్ కూడా మార్కెట్లో తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి.

MDR అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయ్?

MDR అమలు తర్వాత ఆ డబ్బులు నేరుగా యూపీఐ యాప్‌లకు చేరవు. MDR మొత్తం నుంచి వేర్వేరు సంస్థలకు వాటాలు వెళ్తాయి. క్యూఆర్ కోడ్, పేమెంట్ గేట్‌వే సేవలను అందించే మర్చంట్ బ్యాంక్‌కు ఎక్కువ కమీషన్ దక్కుతుంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఆమోదించిన కస్టమర్ బ్యాంక్‌కు కొంత వాటా వెళ్తుంది. చివరిగా మన ఫోన్లో వాడే యూపీఐ యాప్‌కు కొంత మొత్తం కమీషన్‌గా అందుతుంది. ఈ మొత్తం డిజిటల్ లావాదేవీలను పర్యవేక్షించే ఎన్‌పీసీఐ (NPCI)కి కూడా కొంత ఫీజు అందుతుంది.

Also Read: ప్రపంచంలో UPI ఎక్కువగా వాడే దేశాలివే.. ఇండియా ఇక ఆ స్థానంలో ఉండబోదా?

రూ.2 వేలు కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే?

ఒక వేళ మీరు రూ.2 వేలు కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే.. మీకు ఎలాంటి ఛార్జీలు పడవు. ఆ భారం వ్యాపారే భరించాలి. ఉదాహరణకు మీరు రూ.5 వేల విలువ చేసే సామాగ్రిని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనుగోలు చేస్తే.. దానిపై 0.4 శాతం చొప్పున రూ.20 ఎండీఆర్ పడుతుంది. ఆ మొత్తాన్ని వ్యాపారే భరిస్తాడు. అదే రూ.లక్షకు పైగా పెద్ద కొనుగోళ్లు చేస్తే.. ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఒక పరిమితి పెట్టింది. రూ.75 వేలు దాటిన లావాదేవీలపై ఎండీఆర్ ఎంతైనా సరే.. గరిష్టంగా రూ.300 మాత్రమే కట్ అవుతుంది. నెలకు రూ.1 లక్ష వరకు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ ఉండదు.

Tags

Related News

ప్రపంచంలో UPI ఎక్కువగా వాడే దేశాలివే.. ఇండియా ఇక ఆ స్థానంలో ఉండబోదా?

ఎన్నో జంతువులు ఉండగా.. పాత రూ.10 నోటుపై.. ఏనుగు, ఖడ్గమృగం, పులి బొమ్మలే ఎందుకు?

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా? కొత్త MDR రూల్స్ ఇవే

ఉద్యోగ ఇంటర్వ్యూలు పోలీసు విచారణలా అనిపిస్తున్నాయి.. భారతీయ అభ్యర్థుల ఆవేదన

బంగారం ధర పతనం.. మహిళల్లో సందడి మొదలు, మార్కెట్లో ఇవాళ ధరలు

యూపీఐపై కొత్త ఛార్జీలు.. రూ.2 వేలు ధాటితే ఇత్తడే, అంతా వ్యాపారికేనట, క్యాష్ చెల్లింపులే బెటరా?

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అప్‌డేట్స్!

Big Stories

Advertisement
×