Younis Khan Reacts To Pakistan Coaching Rumours: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ ఫినిష్ కాగా.. రెండో టెస్ట్ ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన బాబర్ ఆజం సేన, నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ లో కూడా ఓడిపోవడం గ్యారంటీ అంటున్నారు. షాన్ మసూద్ ను మార్చినా కూడా… పాకిస్తాన్ తలరాత మారడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ (Younis Khan). పాకిస్తాన్ క్రికెట్ జట్టును సర్వనాశనం చేసేది మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఒక్కడేనని… అతడు ఉన్నన్ని రోజులు టీమ్ మెరుగుపడడం కష్టమేనన్నారు. ఆ అష్ట దరిద్రుడు బయటకు వెళ్తేనే… పాకిస్తాన్ విజయాల బాట పడుతుందని వెల్లడించారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా వైఫల్యం అవుతున్న నేపథ్యంలో యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహ్సిన్ నఖ్వీ ఆధ్వర్యంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తోందని ఫైర్ అయ్యారు. ఒకవేళ తనకు కోచ్ బాధ్యతలు ఇచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వస్తే.. అసలు ఒప్పుకోనని వివరించారు. తనకు మొహ్సిన్ నఖ్వీ కలిస్తే.. ఒకటే చెబుతా, తనకు కోచ్ బాధ్యతలు అప్పగిస్తే… ఫుల్ పవర్స్ ఇవ్వాలని కోరుతానని వివరించారు.
కోచ్ పదవి ఇచ్చిన తర్వాత… పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మొహ్సిన్ నఖ్వీ వేలు పెట్టకుండా, ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఫ్రీడం ఇస్తేనే ఆ పదవి తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ప్రతి దాంట్లో మొహ్సిన్ నఖ్వీ వేలు పెడితే.. మాత్రం తాను తప్పుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు యూనిస్ ఖాన్. తాను చెప్పినట్లుగా ఫుల్ పవర్స్ ఉన్న కోచ్ పదవి ఇస్తేనే, పాకిస్తాన్ జట్టును తన ఆధీనంలోకి తీసుకుంటానని వెల్లడించారు. అలా కాదని మొహ్సిన్ నఖ్వీ ప్రతి దాంట్లో వేలు పెడితే… పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడడం కష్టమేనని హెచ్చరించారు. అతడు తప్పుకుంటే బెటర్ అని సూచనలు చేశారు. దీంతో యూనిస్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డును శాసిస్తున్న మొహ్సిన్ నఖ్వీ… తప్పుకోవడం కష్టమే. అతనికి రాజకీయంగా.. బాగానే పలుకుబడి ఉంది. పాకిస్తాన్ ప్రధాని సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఈ నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీను కాదని మరో వ్యక్తికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం కష్టమే. కాబట్టి ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మొహ్సిన్ నఖ్వీ ఆటలు సాగడం గ్యారంటీ అని చెబుతున్నారు.