E-Paper
Advertisement

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం-వెండి ధరలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం-వెండి ధరలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?
Advertisement

Gold-Silver Prices today: పసిడి ప్రియులకు ఊహించని షాక్. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం-వెండి ధరలు పెరిగాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై పడింది. మార్కెట్ ఓపెన్ తర్వాత ధరల్లో మార్పులు ఉండనున్నాయి. దేశీయ-అంతర్జాతీయ మార్కెట్ల బంగారం-వెండి ధరలను ఒక్కసారి చూద్దాం.

పుత్తడి ప్రియులకు షాక్

భౌగోళిక రాజకీయ పరిణామాలు, బలహీనపడిన అమెరికన్ డాలర్, ప్రపంచ ద్రవ్య విధానంపై మారుతున్న అంచనాల నేపథ్యంలో విలువైన లోహాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా పెట్టుబడుదారులు బంగారం-వెండి వైపు చూడడంతో ధరల్లో ఒక్కసారిగా మార్పు కనిపించింది. రాత్రికి రాత్రి సీన్ మారిపోయి ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా ధరలు పెరగడానికి కారణమైంది.

Advertisement

 

భారీగా పెరిగిన బంగారం-వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 4300 డాలర్ల స్థాయికి పైపైకి చేరింది. కిందటి రోజు ఇది 4100 డాలర్లు ఉండగా, రాత్రికి రాత్రే 200 డాలర్లు పెరిగింది. చాలా రోజుల తర్వాత ఈ విధంగా పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సిల్వర్ రేటు భారీగా పెరిగి 63 డాలర్లకు అటు ఇటుగా ఉంది. ఇక డాలరుతో పోల్చితే రూపాయి విలువ రూ. 95.13 వద్ద ప్రస్తుతానికి ఉంది.

Advertisement

మార్కెట్ ప్రారంభమైతే హెచ్చుతగ్గులకు లోనుకావచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్-MCXలో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 2,165 ఉంది. అంటే 1.5 శాతం పెరిగి రూ1.46 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.4,320. అంటే 1.95 శాతం పెరిగి రూ. 2.25 లక్షలకు చేరుకుంది.

దేశీయ మార్కెట్ ధరలు ఒక్కసారి చూద్దాం

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పై పడనుంది. ఆగస్ట్ 6న అనగా గురువారం ఉదయం 10 గంటల తర్వాత ధరల్లో మార్పు కనిపించనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1600 పెరిగింది. తులం రూ. 1,33,600 వద్ద కొనసాగుతోంది. బుధవారం రోజు ఇది రూ. 200 మేరా తగ్గింది. అంతకుముందు రెండు రోజులు రేటు స్థిరంగా కనిపించింది.

ALSO READ: వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్లపై ప్రత్యేక పన్ను?

24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి పసిడి ధర తులం రూ. 1750 పెరిగింది. ప్రస్తుతం రూ. 1,45,750 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఇది రూ. 220 మేరా దిగొచ్చింది. చాలా రోజుల తర్వాత వెండి ధరలు పెరిగాయి. ఒక్కసారిగా రూ. 5 వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.40 లక్షల మార్కుకు చేరింది. మార్కెట్ ఓపెన్ తర్వాత బంగారం- వెండి ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Related News

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక

ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాంక్‌లో పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తోందో వివరాలివిగో

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి, అక్టోబరు 1 నుంచి అమలు

బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!

ప్రతి ఐఫోన్ విక్రయంతో శామ్‌సంగ్‌కు రూ.24,000 లాభం.. ఎలాగంటే?

ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్.. అమూల్ పని అయిపోయినట్లేనా? అంబానీ అసలు వ్యూహం ఏంటి?

వొడాఫోన్ సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఎంత డేటా వినియోగించినా ఎక్స్‌ట్రా ఖర్చు అసలు ఉండదు

Big Stories

Advertisement
×