E-Paper
Advertisement

రూటు మార్చిన ఐటెల్.. జస్ట్ రూ.949కే టైప్-C ఛార్జింగ్, ఏఐ బ్యాటరీతో Ace 3 Heera లాంచ్!

రూటు మార్చిన ఐటెల్.. జస్ట్ రూ.949కే టైప్-C ఛార్జింగ్, ఏఐ బ్యాటరీతో Ace 3 Heera లాంచ్!
Advertisement

itel Ace 3 Heera: చౌకైన ధరలో సరికొత్త ఫీచర్లతో మొబైల్ కొనాలనుకునే వారికి ఐటెల్ గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలో itel Ace 3 Heera పేరుతో ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. కేవలం రూ.949కే లభించే ఈ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడీ ఫోన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పందండి..

టైప్-సి పోర్ట్‌తో ప్రత్యేక గుర్తింపు:

సాధారణంగా ఈ కేటగిరీ ఫోన్లలో పాత మైక్రో-యూఎస్‌బీ పోర్ట్ ఉంటుంది. కానీ ఐటెల్ తమ ఫీచర్ ఫోన్లలో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చి ఆకట్టుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తోనే ఈ ఫోన్‌ను కూడా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. itel Ace 3 Heera బ్లూ, పర్పుల్, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్:

Advertisement

itel Ace 3 Heeraలో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి ఏఐ ఆధారిత బ్యాటరీ ఆప్టిమైజేషన్ సాంకేతికతను జత చేశారు. ఇది ఛార్జింగ్ ఎక్కువ సమయం వచ్చేలా చూస్తుంది. అంతేకాదు.. బ్యాటరీ బాగా తక్కువగా ఉన్నప్పుడు వాడుకోవడానికి ‘సూపర్ బ్యాటరీ మోడ్’ కూడా ఇందులో ఉంది.

Also Read: అదిరిపోయే అప్డేట్.. WhatsAppలో సీక్రెట్ ఓటింగ్, డెడ్‌లైన్ ఫీచర్స్.. ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే!

సరికొత్తగా కింగ్ టాకర్:

Advertisement

పాటలు వినేందుకు బ్లూటూత్, వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో ఉన్నాయి. ఎఫ్‌ఎం ప్రోగ్రామ్‌లను రికార్డ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. దీంతోపాటు ఆటో కాల్ రికార్డింగ్, ఇంగ్లీష్, హిందీ భాషలకు సపోర్ట్ చేసే ‘కింగ్ టాకర్’ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర, వారంటీ వివరాలు:

itel Ace 3 Heera ఫోన్ ధర రూ.949 మాత్రమే. దీని‌పై కంపెనీ ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీని అందిస్తోంది. తక్కువ ధరలో రోజువారీ వాడకానికి, సెకండరీ ఫోన్‌గా వాడుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్ వాడకూడదు అనేకునేవారికి లేదా ఇంట్లో పెద్దవారికి itel Ace 3 Heera బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Also Read: గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

Tags

Related News

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

18 నెలల వారంటీతో ‘యూగ్రీన్ 67W ట్రావెల్ ఛార్జర్’.. ల్యాప్‌టాప్, ఫోన్, బడ్స్ అన్నీ ఒకేసారి ఫుల్ చార్జ్!

బట్టలు కొత్తవాటిలా మెరిసిపోవాలా? వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఇవి మర్చిపోవద్దు!

టీవీ కొనాలా? ప్రొజెక్టర్ తీసుకోవాలా? ధరతో పాటు ఈ ఖర్చులు తెలిస్తే నిర్ణయం సులభమే!

హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలా? జియో,ఎయిర్‌టెల్, ఎక్సిటెల్ 300 Mbps ప్లాన్లలో ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×