E-Paper
Advertisement

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్
Advertisement

Night Driving Tips| రాత్రి సమయంలో హైవేపై డ్రైవింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనాలు హై బీమ్ లైట్లు ఉపయోగిస్తే కళ్లకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఆ లైటింగ్ వల్ల కొద్దిసేపు రోడ్డు సరిగా కనిపించకపోవచ్చు. దీన్ని తాత్కాలిక గ్లేర్ బ్లైండ్‌నెస్ అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి.
అయితే కొన్ని సులభమైన డ్రైవింగ్ అలవాట్లు పాటిస్తే హై బీమ్ కాంతి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు మీ కళ్లను రక్షించడంతో పాటు రాత్రి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి.

ఎదురుగా వచ్చే హై బీమ్ లైట్లను నేరుగా చూడకండి

ఎదురుగా వచ్చే వాహనం హై బీమ్ లైట్లు వేస్తే వాటిని నేరుగా చూడకండి. అలా చేస్తే కళ్లపై ఒక్కసారిగా తీవ్రమైన ప్రభావం పడుతుంది. దానికి బదులుగా రోడ్డుకు ఎడమవైపు ఉన్న తెల్ల గీత లేదా అంచుపై దృష్టి పెట్టండి. ఇలా చేస్తే వాహనాన్ని సరైన దిశలో నియంత్రించడం సులభమవుతుంది. పక్క చూపుతో ట్రాఫిక్‌ గమనిస్తూ సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు.

యాంటీ గ్లేర్ కళ్లజోడు ఉపయోగించండి

Advertisement

మీరు తరచుగా రాత్రి డ్రైవింగ్ చేస్తే యాంటీ గ్లేర్ లేదా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్న కళ్లజోడు ఉపయోగించడం మంచిది. ఇలాంటి గ్లాసెస్ ఎదురుగా వచ్చే తెలుపు లేదా పసుపు రంగు లైట్ల తీవ్రతను కొంతవరకు తగ్గిస్తుంది. దీని వల్ల రాత్రి డ్రైవింగ్ మరింత సౌకర్యంగా ఉంటుంది. మీకు కంటి సమస్యలు ఉంటే కంటి వైద్యుడి సలహాతో మాత్రమే కళ్లజోడు ఎంచుకోండి.

విండ్‌షీల్డ్, అద్దాలను శుభ్రంగా ఉంచండి

మురికిగా ఉన్న విండ్‌షీల్డ్‌పై లైట్ ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దుమ్ము, వేలిముద్రలు లేదా గీతలు ఉంటే గ్లేర్ మరింత పెరుగుతుంది. ప్రతిసారీ రాత్రి కార్ డ్రైవ్ చేసే ముందు విండ్‌షీల్డ్, సైడ్ మిర్రర్లు, రియర్ వ్యూ మిర్రర్‌ను శుభ్రం చేయండి. గ్లాస్ బాగా దెబ్బతిన్నట్లయితే ముందుగానే మార్పించాలి.

కారు లోపలి లైట్లను ఆఫ్ చేయండి

Advertisement

కారు లోపలి లైట్లు వెలిగితే బయట రోడ్డు స్పష్టంగా కనిపించదు. విండ్‌షీల్డ్‌పై ప్రతిబింబాలు కూడా ఏర్పడతాయి. అందువల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కేబిన్ లైట్లను ఆఫ్‌లో ఉంచండి. ఇలా చేస్తే చీకటికి కళ్లూ త్వరగా అలవాటు పడతాయి.

రియర్ వ్యూ మిర్రర్‌ నైట్ మోడ్‌లో పెట్టండి

వెనుక నుంచి వచ్చే వాహనాల హెడ్లైట్లు కూడా కళ్లకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ కారులో నైట్ మోడ్ ఉన్న రియర్ వ్యూ మిర్రర్ ఉంటే దాన్ని ఉపయోగించండి. ఆటో డిమ్మింగ్ ఫీచర్ ఉంటే దాన్ని ఆన్‌లో ఉంచండి. దీంతో వెనుక నుంచి వచ్చే లైటింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది.

Also Read: హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

డిప్పర్ లైట్‌ మెల్లగా ఉపయోగించండి

ఎదురుగా వచ్చే డ్రైవర్‌కు హై బీమ్ తగ్గించమని సూచించడానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే డిప్పర్ ఇవ్వండి. అనవసరంగా పదేపదే ఫ్లాష్ చేయవద్దు. ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ వేగాన్ని నియంత్రించండి.

కళ్లకు అలసటగా అనిపిస్తే విరామం తీసుకోండి

నిరంతరం హై బీమ్ కాంతిని ఎదుర్కొంటే కళ్లకు అలసట వస్తుంది. అలసిన కళ్లతో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. డ్రైవింగ్ చేసేప్పుడు నిద్ర మత్తు కలిగితే ప్రాణాంతకం. అందుకే అవసరమైతే సమీపంలోని పెట్రోల్ బంక్ లేదా సురక్షితమైన ప్రదేశంలో ఆగండి. చల్లని నీళ్లతో ముఖం కడిగి పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించండి.

రాత్రి డ్రైవింగ్ సమయంలో ఈ అలవాట్లు పాటించండి

రాత్రి సమయంలో స్పీడ్ మితంగా ఉండేలా డ్రైవ్ చేయండి. ఇతర వాహనాల నుంచి తగినంత దూరం పాటించండి. హై బీమ్ లైట్లు కనిపించినప్పుడు ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పవద్దు. ఎప్పుడూ రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకుని అప్రమత్తంగా ఉండండి. నిద్రగా అనిపించినా లేదా రోడ్డు సరిగా కనిపించకపోయినా డ్రైవింగ్ చేయకండి.

Also Read: ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

Related News

రోజూ వాడే టవల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

లవ్ బ్రేకప్.. తొలిప్రేమను మరిచిపోవడం ఎందుకు కష్టంగా ఉంటుంది? సైకాలజీలో దీనికి సమాధానం ఇదే

గుండె ఆరోగ్యం కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలి? సరైన విధానం ఇదే

అన్నింటికీ ముందుగానే సిద్ధంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు రిస్క్ అసలు తీసుకోరు

అగరబత్తి, దోమల కాయిల్ వల్ల క్యాన్సర్ వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగ ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

Big Stories

Advertisement
×