E-Paper
Advertisement

మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్‌ పతనం

మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్‌ పతనం
Advertisement

Gold-Silver Price Today:  అంతర్జాతీయ వ్యతిరేక పవనాలు వివిధ దేశాలను వెంటాడుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లతోపాటు బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఆరంభంలో 670 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 210 పాయింట్లు కోల్పోయింది. మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అంతర్జాతీయ వ్యతిరేక పవనాలు.. పతనమవుతున్న మార్కెట్లు

Advertisement

ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం-వెండి ధరలు పతనమయ్యాయి. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ట్రెజరీ యీల్డ్స్, అమెరికా డాలర్ బలపడ్డాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో COMEX మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4,340 డాలర్ల కంటే దిగువకు పతనమైంది.

వెండి ధర కూడా అదే దారిలో పయనిస్తోంది. దాదాపు 2.5 శాతం తగ్గిపోయింది. ఇందుకు బులియన్ మార్కెట్ వాదన మరోలా ఉంది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు కూడా లోహాలపై ప్రభావం చూపాయని చెబుతున్నారు.

Advertisement

బంగారం-వెండి ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్ 

గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్‌కు 4,334.50 డాలర్ల వద్ద హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత స్థాయితో పోలిస్తే 30.80 డాలర్లు తక్కువ. వెండి ధర 2.49 శాతం తగ్గి 67.39 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. గతవారం బంగారం- 5 శాతం, వెండి-9 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఈ ఏడాది మేనెలలో అమెరికాలో ఉద్యోగ గణాంకాలు కాస్త మెరుగ్గా నమోదు అయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయి. ఉద్యోగ మార్కెట్ కారణంగా ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. ఫలితంగా బంగారం, వెండి వంటి వడ్డీ రాబడి లేని ఆస్తుల వైపు మధుపరులు చూడలేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు.

ALSO READ: ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం.. ఆర్బీఐ కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో

రేపో మాపో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్-బ్యాంక్ ఆఫ్ కెనడా సమావేశాలు ఉండనున్నాయి. చైనా ట్రేడ్- ద్రవ్యోల్బణ డేటా వంటివి భారత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Related News

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×