Santosh OTT release date : షహానా గోస్వామి నటించిన ‘సంతోష్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ వల్ల ఆలస్యం అయింది. అయితే థియేటర్లలో కాకుండా, ఇప్పుడు ఓటీటీలోనే నేరుగా వస్తోంది. మేకర్స్ ఒక ఆసక్తికరమైన ట్రైలర్‌ను ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో షహానా గోస్వామి నటనకు, ఉత్తమ నటిగా ఆసియా ఫిల్మ్ అవార్డులో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ సినిమా కులాలను కించపరిచే విధంగా ఉన్నందున సెన్సార్ ఇబ్బందులు వచ్చాయి. దీంతో సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘సంతోష్’ (Santosh) 2024లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సంధ్యా సూరి దీనికి దర్శకత్వం వహించారు. షహానా గోస్వామి, సునీతా రాజ్వర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024లో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. 2025 అక్టోబర్ 17 నుంచి లయన్స్‌గేట్ ప్లే లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
సంతోష్ అనే భర్త ఒక పోలీస్ కానిస్టబుల్. సంతోషంగా ఉన్న వీళ్ళ జీవితం ఒక్క సారిగా కుదేలవుతుంది. ఆమె భర్త ఒక గొడవలో చనిపోతాడు. ఆమెకు భర్త జాబ్ సంతోష్ కి వస్తుంది. ఇప్పడు సంతోష్ పోలీస్ కానిస్టబుల్‌గా జాయిన్ అవుతుంది. ఆమెకు ఈ జాబ్ కొత్త కావడంతో మొదట్లో పోలీస్ పని చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆమె ఇన్స్పెక్టర్ శర్మతో కలిసి పని చేస్తుంది. శర్మ చాలా ధైర్యవంతమైన మహిళ, ఈ సమయంలో సంతోష్‌కు సపోర్ట్ చేస్తుంది. సంతోష్ జాబ్‌లో కొత్తగా ఉంటూ, గ్రామంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది.
Read Also : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా