E-Paper
Advertisement

అంచనాలు తారుమారు.. ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధర, కొనుగోలుదారులకు షాక్

అంచనాలు తారుమారు.. ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధర, కొనుగోలుదారులకు షాక్
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు.. బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా పతనమైన బంగారం ధర, గురువారం మార్కెట్‌లో అంచనాలు తప్పాయి. ఫలితంగా వాటి ధరలు పెరగడం మొదలైంది. దీని వెనుక అమెరికా డాలర్ కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.

అంచనాలు తారుమారు, ఎగిసిన బంగారం ధర

అమెరికన్ డాలర్ పడిపోయే అవకాశం ఉందని, రాబోయే ఆరు నెలల్లో బంగారం ధర ఆశాకాన్ని తాకే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఔన్సు ధర  8,000 డాలర్లకు అంటే 10 గ్రాముల ధర రూ. 2.38 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికితోడు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు మొదలయ్యాయి. జరుగుతున్న పరిణామాలను గమనించిన ఇన్వెస్టర్లు, బంగారం-వెండి వైపు దృష్టి పెట్టారు.

Advertisement

ఫలితంగా గురవారం మార్కెట్లో అంతర్జాతీయ నుంచి భారత్ వరకు వాటి ధరలు అమాంతంగా పెరిగాయి. ఇంకా బంగారం-వెండి ధరలు దిగివస్తాయని ఆశించిన వారికి మళ్లీ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,610 పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2400 వరకు పెరుగుదల నమోదు చేసింది.

ఒక్కరోజులోనే పసిడి ధర తారుమారు కావడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన మొదలైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,25,890గా పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,15,400కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1.65 లక్షల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.

Advertisement

ALSO READ: అమెరికా మళ్లీ సుంకాల అస్త్రం.. భారత్‌పై 25 శాతం విధించే ఛాన్స్, వాషింగ్టన్ వాదనను ఖండించిన కేంద్రం

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గించలేకపోవడం, డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెరగడం ఖాయంగా చెబుతున్నారు. బంగారం ధర ఈ ఏడాది చివరలో అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో గురువారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్సుకు 3,577 డాలర్ల వద్ద చేరింది. డిసెంబర్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.73 శాతం తగ్గింది. 3,535 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో గురువారం ఉదయం MCX షేరు 1.20 శాతం పెరిగింది. 10 గ్రాములు రూ. 1,23,370 వద్ద ట్రేడవుతోంది. MCX సిల్వర్ ఫ్యూచర్స్ సుమారు 2.73 శాతం పెరిగి కిలో రూ. 1,47,700 కు చేరుకుంది.

Related News

అమెరికా మళ్లీ సుంకాల అస్త్రం.. భారత్‌పై 25 శాతం విధించే ఛాన్స్, వాషింగ్టన్ వాదనను ఖండించిన కేంద్రం

నెలకు 15 వేల పెట్టుబడి… 15 ఏళ్లలో కోటి… ఈ 15-15-15 రూల్ తెలుసా?

జాబ్ మారుతున్నారా ? పీఎఫ్ విషయంలో అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే

5 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా వడ్డీ… ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా ?

పెళ్లి కోసం లోన్ తీసుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!

యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలతో 3,588 కోట్లు మాయం… మీ డబ్బు పోతే తిరిగి పొందేందుకు వెంటనే ఇలా చేయండి

మీ బ్యాంకు ఖాతాకు కూడా ఆన్‌-ఆఫ్‌ స్విచ్‌… ఒక్క క్లిక్‌తో చెల్లింపులు బంద్‌… సైబర్ మోసాలకు ఆర్‌బీఐ చెక్

Big Stories

Advertisement
×