America: భారత్ జోరును అడ్డుకునేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆదేశం నుంచి పెట్టుబడుదారులు భారత్ వైపు మొగ్గు చూపుతుండడం గమనించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలో తన టారిఫ్ అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. దాదాపు 25 శాతం టారిఫ్‌లను వేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ భారత్ ఆర్థికంగా దెబ్బ తగలడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
భారత్‌పై మరోసారి సుంకాల కొరడా ఝళిపించింది అమెరికా. భారతదేశ సరకులపై 25 శాతం టారిఫ్ విధించాలని డిసైడ్ అయ్యింది యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్- USTR కార్యాలయం. భారత్‌తోపాటు 14 దేశాలపై కొత్త సుంకాలను ప్రతిపాదించింది. చైనాపై గరిష్టంగా 40 శాతం, వియత్నాంపై 35 శాతం వరకు సుంకాన్ని విధించాలని భావిస్తోంది. భారత్ సహా మరో ఏడు దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్, యూరోపియన్ యూనియన్, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్ వంటి దేశాలకు 20 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది.
ఆయా దేశాలు తమ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేయడం, తక్కువ ధరలకు అమ్మడంతో అమెరికా కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని చెబుతోంది. ఆయా దేశాలతో పోటీ పడటం కష్టతరం అవుతోందన్న అమెరికా వాదన. తమ కంపెనీల ప్రయోజనాలను దెబ్బ తీయడంతో ఈ చర్యకు దిగినట్టు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ వెల్లడించారు. అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే సుంకాలను 25 నుంచి 17 శాతానికి తగ్గిస్తామని వెల్లడించారు.
అమెరికా తన వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ టారిఫ్‌లను విధించాలని భావిస్తోంది. బలవంతపు కార్మిక విధానానికి వ్యతిరేకంగా అమెరికా గత జూలైలో తన 60 దేశాలకు చెందిన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 నుండి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించింది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. గతేడాది విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో చర్చలను తిరిగి మొదలుపెట్టింది.
ALSO READ: నెలకు 15 వేల పెట్టుబడి… 15 ఏళ్లలో కోటి… ఈ 15-15-15 రూల్ తెలుసా?
బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా దేశాల వస్తువుల కంటే తమ వస్తువులపై అమెరికా మార్కెట్‌లో తక్కువ సుంకాలు ఉండాలన్నది భారత్ ఆలోచన. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్- USTR ప్రతిపాదన ప్రకారం.. లేవనెత్తిన సమస్యల పరిష్కరించే ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరిస్తే భారతీయ వస్తువులపై సుంకాలను 17 శాతం వరకు పరిమితం చేయవచ్చు. ఒప్పందం కుదరకపోతే భారత్ వస్తువులపై 25 శాతానికి పెంచే అవకాశం ఉందని యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు. వాణిజ్య చర్చల ఫలితంపై సుంకం ఎంత అన్నది ఆధారపడి ఉంటుంది.