Tirumala Gold Donation: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆ అజ్ఞాత దాత ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కుడిచేత్తో ఇచ్చే దానం ఎడమచేతికి తెలియకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ గోప్యత పాటించిన ఆ పారిశ్రామికవేత్త మరెవరో కాదు.. చెన్నై కేంద్రంగా ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన ‘యాక్సెస్ హెల్త్‌కేర్’ (Access Healthcare) సహ-వ్యవస్థాపకులు, వైస్ ఛైర్మన్ వర్ధమాన్ జైన్.
లయోలా కాలేజీ నుండి అమెరికా దాకా..
చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన వర్ధమాన్ జైన్, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. టెక్నాలజీని వ్యాపార వృద్ధికి ఎలా వాడుకోవాలో బాగా తెలుసుకున్నారు. గతంలో డెల్ సర్వీసెస్ బీపీవో విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే సంకల్పంతో ‘యాక్సెస్ హెల్త్‌కేర్’ను స్థాపించి, ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దైవభక్తితో పాటు సామాజిక బాధ్యత కూడా!
వ్యాపారంలో తనకు దక్కిన ఈ అఖండ విజయానికి ఆ ఏడుకొండలవాడి అనుగ్రహమే కారణమని నమ్మారు ఆయన. కృతజ్ఞతగా రూ. 160 కోట్ల విలువైన 121 కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించారు. అయితే ఆయన సేవ కేవలం ఆలయ విరాళాలకే పరిమితం కాలేదు. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా పేద పిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. అలాగే ‘శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ట్రస్ట్’ ద్వారా ఆకలి నిర్మూలన, విద్య, అత్యవసర వైద్య సేవలను నిస్వార్థంగా అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు విరాళం
తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు వర్దమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను ఈవోకు అందజేశారు. పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే 46 రకాల ఆభరణాలను ఆయన సమర్పించారు. గతంలో 2025 జనవరిలో రూ.6 కోట్లు, ఈ ఏడాది మేలో ఎలక్ట్రిక్ బస్సును కూడా విరాళంగా… https://t.co/VA2Un093MR pic.twitter.com/NyShciHT1U
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2026
Also Read: 300 మందిని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. కాచిగూడ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు!