E-Paper
Advertisement

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!
Advertisement

Mumbai Indians – Rajasthan Royals Trading: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 మినీ వేలం (Indian Premier League 2027 Mini Auction) డిసెంబర్ 16వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ ముగియగా వేలం కోసం దాదాపు 1220 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీళ్లను షార్ట్ లిస్ట్ చేసి, తుది జాబితాను బీసీసీఐ ప్రకటిస్తుంది. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. ముందుగా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తోంది.

జైస్వాల్, ఆర్చ‌ర్ ల‌ను ఇచ్చి పాండ్యాను తీసుకోండ‌ని రాజ‌స్థాన్ కు కండీష‌న్‌!

ఇందుకోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన హెడ్ కోచ్ కుమార సంగక్క‌ర… బెంగళూరుకు కూడా వెళ్లాడట. ఈ డీల్ సందర్భంగా యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్లను హార్దిక్ పాండ్యా స్థానంలో తమకు ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కండిషన్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కండిషన్ నేపథ్యంలో కుమార సంగక్క‌ర వెనక్కి తగ్గి.. హార్థిక్ పాండ్యా తమకు వద్దని అంబానీ ప్యామిలీ ముందే చెప్పినట్టు స‌మాచారం అందుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ రద్దు అయిందని ఇప్పుడు ఓ న్యూస్ బయటకు వచ్చింది. రాజ‌స్థాన్ కాద‌న‌డంతో పంజాబ్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా వెళ్ళాడ‌ని అంటున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

పంజాబ్ కింగ్స్ జ‌ట్టులోకి హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ప్రక్రియ ద్వారా వదిలించుకోవాలని ముంబై ఇండియన్స్ మొదటి నుంచి ప్రయత్నించింది. అటు హార్దిక్ పాండ్యా కూడా 2026 ఐపీఎల్ చివరి దశ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ ఇందులో ముందు వరుసలో ఉండగా… ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగానే ప్రయత్నించింది.

Advertisement

కానీ ఎవరు ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు… హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకుంది. ట్రేడ్ ప్రక్రియ కింద అర్షదీప్ సింగ్ ను ముంబై ఇండియన్స్ కు రూ.18 కోట్లకు ఇచ్చేసింది. హార్దిక్ పాండ్యాకు కూడా అదే ధరకు పంజాబ్ కింగ్స్ లోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అడగనని ఇప్పటికే ప్రకటించాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తాను ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తానని వెల్లడించాడు. పంజాబ్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలప‌డమే తన ముఖ్య లక్ష్యమని వెల్లడించాడు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

వైభ‌వ్ వ‌య‌స్సుపై త‌ప్పుడు కూత‌లు కూస్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. క‌మ్రాన్ అక్మ‌ల్ వార్నింగ్

అల్లా మీద ఒట్టు.. సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

సన్‌గ్రూప్ ఉద్యోగుల కోసం కావ్య పాప దంపతుల షాకింగ్ నిర్ణయం..హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ!

ఐపీఎల్ వేలంలోకి వస్తే వైభవ్ రూ.40 కోట్లు పలుకుతాడు..ఆకాశ్ చోప్రా సంచలన ప్రకటన

వామ్మో ఏం బ్యాటింగ్ రా ఇది? వైభ‌వ్ ను త‌ల‌చుకుంటేనే వెన్నులో వ‌ణుకుపుడుతోంది

స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి..సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×