E-Paper
Advertisement

Gold Rates: మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Rates: మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Today Gold Rates in Market: బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380, 24 క్యారెట్ల బంగారంపై రూ.410 పెరిగింది.

దేశంలో పసిడి, వెండి ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తుండగా.. నేడు భారీగా పెరిగాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.73,670 ఉండగా.. బుధవారం నాటికి రూ.410 పెరిగి రూ.74,080కు చేరింది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,000 ఉండగా.. బుధవారం నాటికి రూ.500 పెరిగి రూ.90,500కు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.67,300 ఉండగా, చెన్నై రూ.67,150, బెంగళూరు రూ. 67,150, ముంబై రూ.67,150, కోల్‌కతా రూ.67,150, కేరళలో రూ.67,150 గా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో రూ.67,150 ఉండగా.. విజయవాడలో రూ.67,150గా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో రూ.73,400 ఉండగా.. చెన్నైలో రూ.73,250, బెంగళూరులో రూ.73,250, ముంబైలో రూ.73,250, కోల్‌కతాలో రూ.73,250, కేరళలో రూ.73, 250 ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్‌ నగరంలో రూ.73,250 పలుకుతుండగా.. విజయవాడలో రూ.73,250గా ఉంది.

వెండి ధరలను పరిశీలిస్తే కిలో వెండిపై రూ.500 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.86,500 పలుకుతోంది. ముంబైలో రూ.86,500 ఉండగా, చెన్నైలో రూ.91,500, కోల్‌కతాలో రూ.86,500, బెంగళూరులో రూ.84,000, కేరళలో రూ.91,000 ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ.500 పెరిగింది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రూ.91,500 ఉండగా.. విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్నంలోనూ రూ.91,500 పలుకుతోంది.

బంగారం రేట్లు గత కొంతకాలంగా పెద్దగా రేట్లు పెరగడం లేదు. దాదాపు 10 రోజులుగా స్థిరగా ఉండటం లేదా తగ్గుతూ ఉన్నాయి. కానీ నేడు బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.410 పెరగడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. త్వరలో బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసేందుకు గోల్డ్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read:  ఈ ప్రభుత్వ స్కీంలతో మహిళలు లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా కూడా స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 2520 డాలర్ల దిశగా పరుగుతు పెడుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 28.49 డాలర్ల వద్ద ఉంది. ఈ క్రమంలో బంగారం రేట్లు రోజురోజుకు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక, డాలర్ పుంజుకున్న క్రమంలో రూపాయి పతనం అవుతోంది. ప్రస్తుతం డాలర్ తో పోల్చితే మారకం విలువ రూ.83.985 వద్ద ఉంది.

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. మంగళవారం ధరలతో పోల్చితే బుధవారం కొంత పెరిగాయి. ఖచ్చితమైన ధరల కోసం మీ ప్రాంతాల్లోని గోల్డ్ షాప్స్ సంప్రదించాలి. ప్రధానంగా పసిడి ధరలు ఆర్బీఐ, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు హెచ్చుతగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×