E-Paper
Advertisement

Huawei New Smartphone: ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ఏకంగా 10.2 అంగుళాల స్క్రీన్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌!

Huawei New Smartphone: ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ఏకంగా 10.2 అంగుళాల స్క్రీన్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌!
Advertisement

Huawei Mate XT Ultimate Design Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ హువావే దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మరో ఫోన్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది. అయితే ఈ సారి మాత్రం ఎవరూ ఊహించని ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రీసెంట్‌గా Apple తన iPhone 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లో Huawei Mate XT అల్టిమేట్ డిజైన్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌గా ఆవిష్కరించింది. ఈ ఫోల్డ్‌ఫోన్ పూర్తిగా ఓపెన్‌ చేసినపుడు భారీ 10.2 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డిస్ప్లే ఎలాంటి డైరెక్షన్‌లో అయినా సౌకర్యవంతంగా పనిచేయడానికి ఫ్లెక్సిబుల్ మెటీరియల్స్‌తో తయారు చేయబడిందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ ఔటర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా Huawei ఫోన్ 5600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Advertisement

Huawei Mate XT Ultimate Design Price

Huawei Mate XT Ultimate Design ధర విషయానికొస్తే.. దీని 16GB RAM + 256GB ఇన్‌బుల్ట్ స్టోరేజ్ గల బేస్ వేరియంట్ CNY 19,999 (సుమారు రూ. 2,35,900) నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 512GB స్టోరేజ్ ధర CNY 21,999 (దాదాపు రూ.2,59,500)గా ఉంది. అలాగే 1TB స్టోరేజ్ వేరియంట్‌ CNY 23,999 (దాదాపు రూ.2,83,100) ధరలలో అందుబాటులో ఉంది. ఇక దీని కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ డార్క్ బ్లాక్, రూయ్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీనిని Huawei Vmall ద్వారా ప్రీఆర్డర్ చేయవచ్చు. సెప్టెంబర్ 20 నుండి చైనాలో సేల్‌ స్టార్ట్ కానుంది.

Advertisement

Also Read: ఐఫోన్ల ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.20,000 తగ్గింపు, వదలకండి బ్రో!

Huawei Mate XT Ultimate Design Specifications

Huawei Mate XT Ultimate Design ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది డ్యూయల్-సిమ్ (నానో+నానో) Huawei Mate XT అల్టిమేట్ డిజైన్ HarmonyOS 4.2 అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై నడుస్తుంది. దీనిని మడతపెట్టినప్పుడు 10.2-అంగుళాల (3,184×2,232 పిక్సెల్‌లు) ఫ్లెక్సిబుల్ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి మడతపెట్టినప్పుడు 7.9-అంగుళాల (2,048×2,232 పిక్సెల్‌లు) స్క్రీన్‌గా మారుతుంది. అలాగే రెండవసారి మడతపెట్టినప్పుడు 6.4-అంగుళాల స్క్రీన్ (1,0328×2,2308×2,232, పిక్సెల్స్) ఉంటుంది. 16GB RAMతో కూడిన Huawei Mate XT అల్టిమేట్ డిజైన్‌కు శక్తినిచ్చే చిప్‌సెట్ వివరాలను కంపెనీ ఇంకా అందించలేదు.

కెమెరా విషయానికొస్తే.. Huawei Mate XT అల్టిమేట్ డిజైన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Huawei Mate XT అల్టిమేట్ డిజైన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB 3.1 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 66W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×