E-Paper
Advertisement

Govt Schemes: ఈ ప్రభుత్వ స్కీంలతో మహిళలు లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Govt Schemes: ఈ ప్రభుత్వ స్కీంలతో మహిళలు లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

Schemes for Women: కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైన స్కీంలను మహిళలకు తీసుకువచ్చింది. ఈ స్కీముల్లో మహిళలు పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదించుకోవచ్చు. మహిళలను సంపన్నులు చేయడానికి, ఆర్థికంగా సాధికారులను చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇలాంటి రెండు స్కీంలను ఇక్కడ మీకు వివరిస్తాం. ఆ స్కీంలో చేరాలంటే అవసరమైన అర్హతలు, స్కీం వల్లే కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక సాధికారిత సాధించుకోండి.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్:

Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం తెచ్చింది. ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టింది. మన దేశంలో మహిళల్లో పొదుపు అలవాటును పెంచే ఉద్దేశ్యంతో ఈ స్కీం తీసుకువచ్చింది. మన దేశంలోని మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. ఈ పథకం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ కాలంలో ఏడాదికి 7.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం మీ పొదుపుపై చెల్లిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

అర్హతలు:

Advertisement

మన దేశంలో నివసించే ప్రతి మహిళా ఈ స్కీంకు అర్హురాలే. మైనర్లకు వారి తల్లిదండ్రులు లేదా.. లీగల్ గార్డియన్ల ద్వారా ఈ పథకం ప్రయోజనాలు కల్పించవచ్చు. ఆ బాలిక పేరు మీద వీరు ఈ స్కీం కోసం బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది.

Also Read: MB University: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్‌ బాబు బాగోతం బట్టబయలు!

సుకన్య సమృద్ధి యోజనా:

ఆడపిల్లలకు బంగారు భవిష్యత్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనా పథకాన్ని తెచ్చింది. ఈ పథకం కింద వార్షిక వడ్డీ రేటు 8.2 శాతాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు, ఈ మొత్తంపై మీరు ఇన్‌కమ్ ట్యాక్స్2లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

అర్హతలు, నిబంధనలు ఇవే

– ఈ స్కీం వర్తించాలంటే సదరు బాలికకు పదేళ్ల నిండకూడదు. ఈ స్కీం కోసం పదేళ్లలోపు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతా ఓపెన్ చేయాలి.
– తల్లిదండ్రులులేదా లీగల్ గార్డియన్ ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది.
– ఈ స్కీం నిబంధనల ప్రకారం ఒక బాలిక పేరు మీద ఒక ఖాతానే తెరవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్లకు గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం రెండు ఖాతాలు మాత్రమే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది.
– ఖాతాదారులు ఈ స్కీం కింద ఏడాదికి కనిష్టంగా కనీసం రూ. 250 రూపాయలు గరిష్టంగా రూ. 1,50,000 ఆ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
– ఒక వేళ ఏడాదిలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకుంటే పెనాల్టీగా రూ. 50 పడుతుంది.
– ఖాతా తెరిచినప్పటి నుంచి 14 ఏళ్ల వరకు ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
– సుకన్య సమృద్ధి యోజనా పథకం మెచ్యూరటీ కావడానికి సదరు బాలికకు 21 ఏళ్లు నిండాలి.

Related News

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

Big Stories

Advertisement
×