E-Paper
Advertisement

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన
Advertisement

Durgam Cheruvu: హైదరాబాద్ సిటీలో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న దుర్గం చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లడంతో బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు, తనిఖీలు నిర్వహించారు. దీంతో మురుగునీటికి అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

దుర్గంధంగా మారిన దుర్గం చెరువు

హైదరాబాద్ సిటీలో పర్యాటక ప్రాంతం మాదాపూర్‌లోని దుర్గం చెరువు. సాయంత్రం అయితే చాలామంది విశ్రాంతి కోసం అక్కడికి వస్తుంటారు. అలాంటి చెరువు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. చెరువుల్లోకి మురుగునీరు, కాలుష్య కారకాలు తరలివస్తున్నాయి. దుర్గం చెరువుపై అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపించింది.

Advertisement

ఎస్టీపీల నిర్వహణ, వాటర్ వర్క్స్ అధికారులు నిర్లక్ష్యం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దుర్గంచెరువు కాస్త దుర్గందంగా మారిపోయింది. చెరువు పరిరక్షణ కోసం గతంలో ఓ ఎస్టీపీ ఉండగా, మరోకటి కొత్తగా నిర్మించారు. ఈ రెండింటిని అనుసంధానం చేసి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా మురుగునీరు నేరుగా దుర్గంచెరువులోకి చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.

బిగ్ టీవీ కథనాలతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన

దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై అధికారులు రంగంలోకి దిగారు.  శనివారం జలమండలి, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో దుర్గంచెరువును పరిశీలించారు. దుర్గం చెరువును నాలుగు వైపులా పరిశీలించిన అధికారులు, మురుగునీరు చేరకుండా నియంత్రించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నారు. జనాభా పెరగడం వల్ల మురుగునీటి ఉత్పత్తి గతం కంటే గణనీయంగా పెరిగినట్లు అంచనాకు వచ్చారు.

Advertisement

మురుగునీరు చెరువులో కలవకుండా ఉండేందుకు నాలుగు ప్రధాన ఇన్‌‌‌‌లెట్ల వద్ద మురుగునీటి మళ్లింపు, శుద్ధి వంటి శాశ్వత సాంకేతిక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా మాదాపూర్, సైలెంట్ వ్యాలీ, విఠల్‌రావు నగర్, టీజీఐఐసీ లేఅవుట్ నాలాల ద్వారా చెరువులోకి మురుగునీరు చేరుతున్నట్లు గుర్తించారు.

ALSO READ: ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

వర్షాకాలంలో వర్షపు నీటితో కలసి అధికంగా మురుగునీరు చెరువులోకి చేరుతున్న పరిస్థితిని గమనించారు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు చెరువు పరిసరాలు, నీటి ప్రవాహం ద్వారా శాస్త్రీయ అధ్యయనం చేపట్టనున్నారు. చెరువు సహజ సౌందర్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అన్ని విభాగాలతో కలిసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మెట్రోవాటర్ బోర్డు జేఎండీ.

 

Related News

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

Big Stories

Advertisement
×