E-Paper
Advertisement

Gold-Silver Prices: బంగారం-వెండి ధరలు.. ఇంకా పతనమయ్యే అవకాశం, వినియోగదారులు మాటేంటి?

Gold-Silver Prices: బంగారం-వెండి ధరలు.. ఇంకా  పతనమయ్యే అవకాశం, వినియోగదారులు మాటేంటి?
Advertisement

Gold-Silver Prices: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇంకా దిగొస్తాయా? ఇరాన్ వార్ మొదలై మూడు వారాలు పూర్తయినా ఆయా లోహాల ధరలు ఏ మాత్రం పెరగడం లేదు? రోజు రోజుకూ మార్కెట్‌లో ధరలు తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయవచ్చా? ఇంకా ఆగాలా? మార్కెట్ వర్గాలు ఈ విషయం ఏం చెబుతున్నాయి.

బంగారం-వెండి ధరలు ఇంకా పతనమయ్యే అవకాశం

Advertisement

అంతర్జాతీయంగా ఏదైనా ఒడుదుడులు వచ్చాయంటే పెట్టబడిదారులు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. అందులో పెట్టుబడులు పెడితే డబ్బు సేఫ్ అని భావిస్తుంటారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మూడు వారాలు పూర్తి అయ్యింది. బంగారం-వెండి ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా రోజురోజుకూ మార్కెట్ లో ఆయా ధరలు పతనమవుతున్నాయి. కొద్దిరోజులు ఇదే పరిస్థితి తప్పదని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

2026 మార్చి నెలలో పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై ఆయా దేశాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆయిల్ ధరలు మార్కెట్లో ఆకాశాన్ని తాకాయి. రేపటి రోజు ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగాల్సిపోయి రోజు రోజుకూ పడిపోతున్నాయి.

Advertisement

వినియోగదారులు కొనుగోళ్లకు ఇదే సరైన సమయం?

మార్కెట్లో ఏం జరుగుతోంది. మార్కెట్ నిపుణుల మేరకు మార్చి నెలలో బంగారం ధర 10 శాతం పడిపోయింది. వెండి దాదాపు 20 శాతం ఎక్కువ కుంగిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో మధుపరులు బంగారం, సిల్వర్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు.

దీంతో 2025 ఏడాది మార్కెట్లో బంగారం ధరలు 66 శాతం, వెండి 130 శాతం దూసుకెళ్లాయి. చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు ఎక్కువ లాభాలు రావడం కష్టమని భావించారు. యుద్ధం మొదలైన వెంటనే బంగారం, వెండి పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గారు. ఉన్నవాటిని అమ్మేసుకునే వారంతా డ్రాపయ్యారు. ఫలితంగా మార్కెట్లో ధరలు పతనమవుతున్నాయి.

ALSO READ: ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. ఒక్కో ఆర్డర్ కు ఎంత కట్టాలంటే?

అటు ETFలు, లెవరేజ్ ట్రేడర్ల భయం పెరగడంతో బంగారం, వెండి పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గారు. దీంతో ధరలు మరింత కిందకి జారాయి. అయితే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో డాలర్ బలంగా మారింది. దేశీయ మార్కెట్‌లో రూపాయి పతనం అవుతోంది. దీంతో పెట్టుబడి దారులు అటువైపు చూడడం మానేశారు. డాలర్ ఖరీదు పెరిగితే బంగారం ధర సహజంగా తగ్గుతుంది. ఇప్పుడు అలాంటిదేమీ కనిపించలేదు.

ఆయిల్ సరఫరా ఆగిపోవడంతో వాటి ధరలు మార్కెట్లో భగ్గుమన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం ఒకవైపు, అమెరికా వడ్డీ రేట్లు పెంచవచ్చని అంచనా మధ్య విక్రయించే బాండ్లు 4. నుంచి 4.7కి పెరిగాయి. అందుకే చాలామంది మదుపరులు బంగారం కంటే బాండ్లు, ఆయిల్‌ బెటరని భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గవచ్చని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ లెక్కన బంగారం కొనుగోలుదారులకు ఇదే సరైన సమయని అంటున్నారు.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×