గూగుల్ వ్యాలెట్ (Google Wallet) వాడే ప్రయాణీకులకు టెక్ దిగ్గజం గూగుల్ అద్భుతమైన విషయం చెప్పింది. ఇప్పటికే ప్రయాణాలకు సంబంధించి అప్ డేట్స్ ను నోటిఫికేషన్ల ద్వారా అందిస్తుండగా, ఇకపై పూర్తి లైవ్ అప్ డేట్స్ అందించనున్నట్లు తెలిపింది. విమానాలు, రైలు ప్రయాణాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్ డేట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. బోర్డింగ్ టైమింగ్స్ లో మార్పులు, ట్రైన్స్, ప్లేన్స్ క్యాన్సిలేషన్ వివరాలను ఎప్పటికప్పుడు గూగుల్ వ్యాలెట్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించబోతోంది. ఈ మేరకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. “విమానాలు, రైలు ప్రయాణాలు, ఆయా ఈవెంటలకు సంబంధించి గూగుల్ వ్యాలెట్ లైవ్ అప్ డేట్లను ఉపయోగిస్తుంది. విమాన ప్రయాణాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లో డిస్ ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించింది.
Google Maps, Waymo, Uber Eats, రైడ్ షేర్, ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరిగానే లైవ్ అప్ డేట్లను ఆశించవచ్చని Google వెల్లడించింది. Google Wallet వినియోగదారులకు మరింత సరళంగా ఈ వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ కొత్త అవకాశం Google Play సర్వీసులకు సంబంధించి వెర్షన్ 25.41లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎప్పటిలాగే Google సిస్టమ్ సర్వీసెస్ రిలీజ్ నోట్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చిన ఫీచర్లు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక అలర్ట్‌ల గురించి.. ఆండ్రాయిడ్ 12, అంతకు ముందు వెర్షన్ లో ఉండి, వాలెట్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని Gmail నుంచి లాయల్టీ పాస్ ను డౌన్ లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్లు అందుతాయని గూగుల్ తెలిపింది. అటు బ్యాంక్ యాప్ లు నేరుగా Google Walletకి క్రెడిట్, డెబిట్ కార్డ్ ను యాడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి Android 12, అంతకు ముందు వెర్షన్ లో ఉండి ఉంటే సరిపోతుందన్నారు. విమానాలు, రైలు ప్రయాణాలు, ఈవెంట్ లతో సహా కీలక ప్రయాణ ప్రయాణాల కోసం Google Walletలో లైవ్ అప్ డేట్స్ చూసే అవకాశం ఉందన్నారు.
Read Also: మత్తెక్కించే మాటలతో మాయ చేయనున్న చాట్ జిపిటి.. ఇక ఆటగాళ్లకు పండగే!
⦿ Google Wallet పాస్‌లను నిక్ నేమ్స్ తో విడదల చేస్తుంది.
⦿ అమెరికన్ ఎయిర్ లైన్స్ బోర్డింగ్ పాస్‌ల కోసం Google Wallet సపోర్ట్ చేస్తుంది.
⦿ Google Wallet Androidలో టెన్త్ స్టేట్ IDకి సపోర్టు చేస్తుంది.
Read Also: 36 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన గుర్తుతెలియని వస్తువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?