BigTV English

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..
Advertisement

Cuddalore Diwali Celebration:

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా దీపాలతో ఇళ్లను ముస్తాబు చేయడంతో పాటు పటాకుల మోతలతో దద్దరిల్లేలా చేస్తున్నారు. అయితే, ఇతర ప్రాంతాలు ఎలా ఉన్నా, తమిళనాడులోని కడలూరులో ఉన్న ఓ గ్రామం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ గ్రామ ప్రజలంతా చందాలు వేసుకుని మరీ, పటాకులు కొనితెచ్చి పేల్చుతారు. అదీ కిలో మీటరు మేర పరిచి కాల్చుతారు. ఇంతకీ ఆ ఊరు ఏది? ఆ పటాకుల కథ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


గోతండరామపురం గ్రామంలో చందాలు వేసుకుని మరీ..

తమిళనాడు కడలూరు జిల్లాలోని గోతండరామ పురంలో దీపావళి వేడుకలు ఎక్కడా లేని విధంగా జరిగాయి. ఈ పండుగ కోసం ఆ ఊరి ప్రజలు చందాలు వేసుకుని మరీ పటాకులు కొని తెచ్చారు. ఒక్కో ఫ్యామిలీ రూ. 10 వేలు చందా వేసుకున్నారు. మొత్తం రూ. 1 లక్ష ఖర్చు చేసి పటాకులను తెచ్చారు. వీటిని కిలో మీటరు మేర పేర్చారు. అందరూ కలిసి ఆ పటాకులను అంటించారు.

నాలుగు నిమిషాల పాటు పటాకుల గర్జన   

అక్టోబర్ 20 గోతండరామపురం గ్రామస్తులంతా పటాకులను కార్చే కార్యక్రమం నిర్వహించారు. ఒక్కసారి పటాకులను కాల్చిన తర్వాత ఇవి ఏకంగా 4 నిమిషాల 12 సెకన్ల పాటు నిరంతరం పేలాయి. పేలుళ్లను చూసి గ్రామస్తులంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. పటాకులు కాలుతుండగా, అందరూ వాటిని చూస్తూ ముందుకు కదిలారు. బాంబుల లైటింక్, సౌండ్ చాలా దూరం ప్రతిధ్వనించింది. పటాకుల కాంతి, శబ్దం చూసి గ్రామస్తులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే కనిపించే అద్భుత దృశ్యంగా అభివర్ణించారు. ఈ అద్భుతమైన పటాకులు కాల్చే వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.


Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!

ఆనందంలో ముగిని పోయిన గోతండరామపురం  

ఈ కార్యక్రమం గ్రామంలోని 10 కుటుంబాలు ముందుండి నడవడం వల్ల జరిగిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.   దీపావళి పెంపొందించే ఐక్యత, భాగస్వామ్య ఉత్సాహాన్ని సూచించింది. పటాకులు పేలుతున్నప్పుడు గ్రామస్తులు అంతా ఆనందించారు. వారిలో పండుగ ఉత్సాహం నెలకొన్నది. ఇక ఈ క్రాకర్స్ పేల్చే వేడుకకు మీడియాలోనూ అద్భుతమైన కవరేజ్ వచ్చింది. పాలిమర్ న్యూస్, సన్ న్యూస్, తంతి టీవీ, న్యూస్ తమిళ్ 24×7తో సహా స్థానిక తమిళ వార్తా సంస్థలు ఈ కార్యక్రమాన్ని కవర్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్రామస్తులు అంతా కలిసి క్రాకర్స్ కాల్చడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Related News

Foreign Tourist Trolled: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Non-venomous Snake: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Big Stories

×