ప్రైమ్ మెంబర్ షిప్ వివాదం కారణంగా సుమారు 2.5 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 22 వేల కోట్లో సెటిల్ మెంట్ చేసుకునేందుకు ఈ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సెటిల్ మెంట్ కు రెడీ అయ్యింది. ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకునేందుకు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్లు అమెజాన్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 2.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అమెజాన్ అంగీకరించింది. అమెజాన్ ప్రైమ్ లో చేరి తమ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఇబ్బంది పడిన యూజర్లకు ఈ డబ్బులో బిలియన్ డార్లను జరిమానా రూపంలో చెల్లించనుంది.
సెటిల్ మెంట్ కు సంబంధించి అధికారిక ఆర్డర్ వచ్చిన సుమారు మూడు నెలల్లోపు డబ్బులను కస్టమర్లకు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ మీద వచ్చిన ఫిర్యాదుల మీద సుమారు 2 ఏళ్లుగా విచారణ జరుగుతుంది. వినియోగదారులు ప్రూమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోకుండా వస్తువులను కొనుగోలు చేయడాన్ని అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే క్రిటికల్ గా మార్చిందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ క్రిస్ ముఫారిజ్ వెల్లడించారు. దీని మీద అప్పీళ్లకు వెళ్లడానికి బదులుగా సెటిల్ చేసుకునేందుకు అమెజాన్ ముందుకొచ్చిందన్నారు. అదే సమయంలో తమ వినియోగదారులు ప్రైమ్ మెంబర్ షిప్ పొందేందుకు, దాన్ని క్యాన్సిల్ చేసుకునేందుకు తమ టీమ్ కృషి చేస్తుందని అమెజాన్ ప్రకటించింది.
నివేదిక ప్రకారం, జూన్ 23, 2019, జూన్ 23, 2025 మధ్య కొన్ని ఆఫర్ల ద్వారా Prime కోసం సైన్ అప్ చేసిన కస్టమర్లు ఇందులో ఉన్నారు. కోర్టు తీర్పు ప్రకారం బాధిత కష్టమర్లకు ఆటోమేటిక్ గా $51(రూ. 4990) అందుకుంటారు.
Read Also: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?
USA బేస్డ్ కస్టమర్లు ఏదైనా 12 నెలల కాలంలో మూడు సార్లు, అంతకంటే తక్కువ సమయంలో తమ Prime ప్రయోజనాలను ఉపయోగిస్తే, డిసెంబర్ 24, 2025 నాటికి ఆటోమేటిక్ గా $51 చెల్లింపును అందుకుంటారు. ఆటోమేటిక్ చెల్లింపులు పూర్తయిన తర్వాత, జనవరి 23, 2026 నాటికి క్లెయిమ్ చేయాలనుకునే ఇతర ప్రైమ్ కస్టమర్ల కోసం సమాచారాన్ని పంపుతారు. అర్హత ఉన్నవారు జూలై 23, 2026 వరకు తమ క్లెయిమ్‌ల ఫారమ్‌లను సమర్పించి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ప్లైట్స్, ట్రైన్స్ లైవ్ అప్ డేట్స్.. గూగుల్ వ్యాలెట్ యూజర్లకు గుడ్ న్యూస్!