BigTV English

Mass Jathara : ‘మాస్ జాతర’ స్టోరీని లీక్ చేసిన నిర్మాత.. మళ్లీ అదే చేస్తున్న నాగ వంశీ..

Mass Jathara : ‘మాస్ జాతర’ స్టోరీని లీక్ చేసిన నిర్మాత.. మళ్లీ అదే చేస్తున్న నాగ వంశీ..
Advertisement

Mass Jathara : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర.. దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రవితేజ తన పాత్రతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. సినిమా స్టోరీని లీక్ చేసి జనాల్లో క్యూరియాసిటీని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా నిర్మాత లీక్ చేశాడు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు నాగ వంశీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు అంటూ నెటిజెన్లు కామెంట్లతో నెట్టింట హంగామా చేస్తున్నారు. కాస్త వివరాల్లోకి వెళితే..


స్టోరీని లీక్ చేసిన నాగ వంశీ..

మాస్ మహారాజా రవితేజకు గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా పడలేదు. సినిమా కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో జోరుని పెంచింది. ఈ క్రమంలో తాజాగా ఈ యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అయితే ఈయన సినిమా గురించి మాట్లాడుతూ స్టోరీని లీక్ చేసేసారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ ఇంటర్వెల్ కు 20 నిమిషాలు ముందు సెకండ్ ఆఫ్ కు మధ్యలో మాస్ బీట్ పాట వస్తుంది. ఆ తర్వాత 1అవర్ 25 మిస్ మాస్ సీన్లతో ఊగిపోతుంది. అప్పుడు మరో పాట కూడా వస్తుంది. మాస్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు అది రవితేజకే సాధ్యం. ఈ సినిమాలో రవితేజను మీరు ఎలాగైతే చూడాలనుకున్నారో అలానే చూడొచ్చు అంటూ నిర్మాత అన్నారు. క్లైమాక్స్ లో రాజేంద్రప్రసాద్ ట్విస్ట్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది థియేటర్లలో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి అంటూ కాన్ఫిడెంట్గా నాగవంశీ చెప్తున్నాడు.. ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : ప్రదీప్ రంగనాథన్ ను వదలని శాంతి స్వరూప్..శరత్ కుమార్ కు చెమటలు..


నాగ వంశీ మళ్లీ హైప్ ఇచ్చాడు.. 

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ లలో ఒకరు నాగ వంశీ.. ఈయన నిర్మిస్తున్న సినిమాల గురించి ప్రమోషన్స్ లో ఎప్పుడూ గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ మూవీ గురించి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ మాట్లాడుతాడు. గతంలో ఈయన నిర్మించిన వార్ 2, కింగ్ డమ్ చిత్రాల ప్రమోషన్స్ లో కూడా అలానే సినిమాల గురించి గొప్పగా చెప్పాడు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. అంతేకాదు కలెక్షన్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమాకు ఈయన నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో మూవీ గురించి చెప్తూ హైప్ ని క్రియేట్ చేసేలా మాట్లాడాడు. గతంలో ఆ సినిమాల రిజల్ట్ ఈ సినిమా కూడా వస్తుందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మళ్లీ ఆయన సినిమా గురించి పొగుడుతూ మాట్లాడాడు అంటే కచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వెయిట్ చేయాల్సిందే.. కనీసం ఈ సినిమా అన్నా ఆయనకు భారీగా లాభాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా రవితేజ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.. ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?

Nara Rohith: నారా వారింట మొదలైన పెళ్లి సందడి.. ఏ రోజు ఏం జరగనున్నాయంటే

Brahmanandam : బ్రహ్మానందంకు ఘోర అవమానం.. SKNపై మండిపడుతున్న ఫ్యాన్స్

R Chandru: నా సినిమా స్ఫూర్తితోనే ఓజీ తీశారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Toxic: టాక్సిక్ నుంచి డైరెక్టర్ తప్పకుందా… అసలు ఏం జరుగుతుంది

Dude Movie: ఒక్క సినిమాతో క్రష్ గా మారిన ఐశ్వర్య శర్మ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Venkatesh : వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్… గురూజీ ప్లాన్ అదిరింది బాసూ..

Big Stories

×