Nara Rohith: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేసి ఒక ఇంటి వారు అవుతున్నారు. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ నార్ని నితిన్ ఆంటీ కుర్ర హీరోలు వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరికొంతమంది హీరోలు ఈ ఏడాది నిశ్చితార్థం జరుపుకొని వచ్చే ఏడాది పెళ్లికి రెడీ అవుతున్నారు. అందులో విజయ్ దేవరకొండ విశాల్, అల్లు శిరీష్ ఉన్నారు.
ఇక ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి రెడీ అవుతున్న హీరో నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా నారా రోహిత్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. బాణం సినిమాతో తెలుగు తెరకు ఎంపీ ఇచ్చిన రోహిత్ మొదటి సినిమాతోనే మంచి డీసెంట్ హిట్ ను అందుకొని అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత సోలో సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అంతటి విజయాన్ని రోహిత్ అందుకోలేకపోయాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
విజయపజయాలను పట్టించుకోకుండా మంచి మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.. కానీ, రోహిత్ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ఇప్పటికీ ఒక మంచి హిట్ కోసం భారీగా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే సుందరకాండ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు రోహిత్.
ఇక ప్రతినిధి 2 సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ శిరీషతో ప్రేమలో పడ్డాడు రోహిత్. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు ఈ జంట. గత ఏడాదిలోనే వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 30న నారా రోహిత్ శిరీష పెళ్లి జరగనుంది. దీంతో ఇప్పటి నుంచే నారావారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే అద్భుతమైన వేడుకలతో నారా వారిల్లుకళకళలాడలాడబోతోంది.
అక్టోబర్ 27 నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలుకానున్నాయి. హల్దీ, పెళ్లి కొడుకు వేడుక, మెహందీ, ముహూర్తం వంటి వివాహ వేడుకలు తెలుగువారి సాంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. ఇప్పటికే పసుపు దంచడం కార్యక్రమం పూర్తయినట్లు శిరీష తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక వీరిద్దరి పెళ్ళికి సినీ మరియు రాజకీయ రంగలకు చెందిన ప్రముఖులందరూ రానున్నట్లు తెలుస్తుంది.మరి పెళ్లి తర్వాత నారా రోహిత్ లక్ మారి స్టార్ హీరోగా ఎదుగుతాడేమో చూడాలి.