Tuni incident: కాకినాడ జిల్లా తుని నియోజక వర్గంలో మైనర్‌పై తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణ రావు.. జగన్నాధగిరి గురుకుల పాఠశాల నుంచి తాతవరుస అవుతానని చెప్పి విద్యార్ధినిని తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై ఆఘాయిత్యానికి ప్రయత్నించగా.. తోట యజమాని అడ్డుకుని వీడియో తీయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికు స్కూటర్‌పై తీసుకొని పరార్ అయ్యాడు నారాయణ రావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. జగన్నాధగిరి గ్రామంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై.. నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి మృతి చెందాడు. తల్లి రోజువారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేయాలనే పేరుతో.. నారాయణరావు తరచుగా ఇంటికి వస్తుండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒకరోజు బాలికను తోటలోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ విషయాన్ని గమనించిన బాలిక కుటుంబ సభ్యులు అతడిని అక్కడికక్కడే పట్టుకుని, దేహశుద్ధి చేసి, అనంతరం తుని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గురుకుల పాఠశాల వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులకు అండగా వైసీపీ మహిళా విభాగం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చేరుకున్నారు. హోమ్ మినిస్టర్ అనిత స్వయంగా వచ్చి బాధిత కుటుంబాన్ని కలవాలి, అలాగే బాధ్యత రహితంగా వ్యవహరించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.
విషయాన్ని రాజకీయ కోణంలోకి తీసుకు వెళ్ళొద్దంటూ.. పోలీసులు అందరినీ నిలువురించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా పాఠశాల సిబ్బంది మాత్రం తమకు సంబంధం లేదని వాదిస్తున్నారు. కొత్తగా వచ్చిన టీచర్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సమయంలో, ఒక హౌస్ టీచర్ ఇంజెక్షన్ కోసం విద్యార్థిని బయటకు తీసుకెళ్తున్నాను అంటూ అనుమతి తీసుకుందని చెబుతున్నారు. పేరెంట్స్ అని తెలిస్తే మాత్రమే పంపించండి అని చెప్పాను.. ఆమె లెటర్ కూడా ఇచ్చింది అంటూ ఒక లెటర్ ని చూపించే ప్రయత్నం గురుకుల పాఠశాల టీచర్లు చేస్తున్నారు.. అయితే, పాఠశాల సిబ్బంది చెబుతున్న ఈ వెర్షన్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో మూడు నుంచి నాలుగు సార్లు.. ఆయన మైనర్ బాలికను తీసుకువెళ్లినట్లుగా గురుకుల పాఠశాల స్టాఫ్ చెప్తున్నారు.
Also Read: నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త పోస్ట్ వైరల్
ప్రస్తుతం తుని పోలీసులు కేసు నమోదు చేసి, నారాయణరావుపై POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను మెడికల్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కేసు పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.