Indian Railways: ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లోయర్ బెర్త్‌లోనైతా కిటికి పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. అవసరమైనప్పుడు ఫ్రీగా బోగీలో నడవడానికి వీలుంటుంది. అదే మిడిల్ లేదా అప్పర్ బెర్త్ విషయానికి వస్తే అయితే.. పైనకు ఎక్కి పడుకోవాలి, లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్‌కు డిమాండ్ ఎక్కువ. ఇందులో సైడ్ లోయర్ బెర్త్‌కు మరీ ఎక్కువ. ఎందుకంటే ఇది సింగిల్‌గా వేరే వారితో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చాలా మంది ఈ సైడ్ లోయర్ బెర్త్ కోసం ఆరాటపడుతారు. అయితే, బెర్త్ విషయంలో ఐఆర్‌సీటీ కొన్ని నిబంధనలను రూపొందించింది. కొందరికి లోయర్ బెర్త్ కోసం రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు ఓ సారి చూద్దాం.
భారత రైల్వే శాఖ ప్రకారం స్లీపర్ క్లాస్‌లో సైడ్ లోయర్ బెర్త్ ఎక్కువగా వృద్ధులకు కేటాయిస్తారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 55 ఏళ్లు పైబడిన మహిళలకు ఎక్కువగా ఈ బెర్త్ కేటాయిస్తుంటారు. అలాగే.. గర్భవతులు, వికలాంగులకు ఈ బెర్త్ కేటాయిస్తారు. ముఖ్యంగా వికలాంగులకు స్లీపర్ క్లాస్‌లో నాలుగు సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. రెండు కింది సీట్లు, రెండు పైన సీట్లు వీరికి రిజర్వ్ చేస్తారు. థర్డ్ ఏసీలో రెండు సీట్లు, ఏసీ3 ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేస్తారు. ఇక గరీబ్ రథ్‌లో కింద రెండు సీట్లు, పైన రెండు సీట్లు వికలాంగులకు కేటాయిస్తారు.
సీనియర్ సిటిజన్లు, వికలాంగులు లేదా గర్భవతులకు టికెట్ బుకింగ్ సమయంలో అప్పర్ బెర్త్‌లు కేటాయిస్తే.. ఆన్‌బోర్డ్‌లో టీటీ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పి లోయర్ బెర్త్‌ను పొందవచ్చు.
Also Read: Prabhas: కల్కీ సినిమా బాలేదు.. ప్రభాస్ ఓ జోకర్‌లా ఉన్నాడు: బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్
సైడ్ లోయర్ బెర్త్ ప్రయాణికులు రాత్రి ఆ బెర్త్‌పై పడుకున్నా.. పగలు మాత్రం పై బెర్త్‌లో ఉన్న యాత్రికులు లోయర్ బెర్త్‌పై కూర్చోవడానికి చోటివ్వాలి. RAC వారు కూడా పగలు లోయర్ బెర్త్ యాత్రికుడితో కలిసి కూర్చోవచ్చు. రైల్వే ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పడుకునే సమయంగా నిర్దారించారు.
ఒక వేళ మీరు సైడ్ లోయర్ బెర్త్ కావాలని అనుకుంటే.. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో సరైన ఆప్షన్ ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. నిబంధనలకు లోబడి రైల్వే మీకు బెర్త్ కేటాయిస్తుంది.