Gold Rate Dropped: అరే.. ఏంట్రా ఇది బంగారం ధరలు మనతో ఇలా ఆడుకుంటున్నాయి. రెండు రోజులు ధరలు పెరుగుతున్నాయి. మళ్లీ ఒక రోజు తగ్గుతున్నాయి. కానిస్టాంట్‌గా లేని బంగారం ధరలు.. గత రెండు రోజులు బంగారం ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ రెండు రోజులు ఎంత పెరిగిందో అది అంతా తగ్గింది.. ఒక్క రోజు బంగారం ధరలు భారీగా తగ్గిపోతే పసిడి ప్రియులకు చెప్పలేని ఆనందంలో మునిగిపోతారు. కానీ ముందు ముందు బంగారం ధరలు పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనేది అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న..
నేటి బంగారం ధరలు ఇలా..
సోమవారం స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. మంగళవారం తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,12,900 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.710 తగ్గింది..
బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు దారులకు ఊరట..
కొంత కాలంగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది.. దీంతో చాలా మంది దీనిని మంచి పెట్టుబడిగా పెట్టుకున్నారు . భౌతికంగా బంగారం కొనుగోలు చేయడంతో పాటుగా.. డిజిటల్‌గా గోల్డ్ కొనుగోలు చేస్తుండటం సహా గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా బంగారంతో పాటే వెండి ఆభరణాలకు కూడా ఇటీవల డిమాండ్ పెరిగిపోయింది. వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది మన దేశంలో ఎప్పటి నుంచో సంప్రదాయం వస్తోంది. కానీ ఇప్పుడు బంగారం ధరలు తగ్గడంతో పెట్టుబడిగా పెట్టిన వారు అందరు ఆందోళ చెందుతున్నారు.. కానీ బంగారం ధరలు ముందు ఇంకా పెరిగి అవకాశం ఉందని చెబుతున్నారు. కావున తగ్గినప్పుడు ఛాన్స్ వచ్చిందని కొనడం మంచిది..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,250 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,250 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,250 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,400 వద్ద ఉంది.
Also Read: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!
నేటి సిల్వర్ ధరలు ఇలా..
మంగళవారం బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నాలుగు రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు నేడు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,68,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,65,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,51,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి లేదంటే ఇంత మంచి ఛాన్స్ మళ్లీ రాదు..