Arshad Warsi: కల్కీ 2898 ఏడీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాకు ప్రశంసలు రావడమే కాదు.. కాసుల వర్షం కూడా కురిసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పడుకోన్, దుల్కర్ సల్మాన్ వంటి ఫేమస్ సెలెబ్రిటీలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని నిర్మించిన ఈ సినిమా సక్సెస్ అయింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దీని సీక్వెల్ పనుల్లో తలమునకలయ్యారు. ఈ సినిమా గురించి.. మరీ ముఖ్యంగా ప్రభాస్ గురించి ఎవరూ నెగెటివ్‌గా మాట్లాడలేదు. కానీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి మాత్రం కల్కి గురించి చాలా లైటర్ టోన్‌లో మాట్లాడాడు. ప్రభాస్ పాత్ర పైనా కామెంట్ చేశాడు.
కంటెంట్ క్రియేటర్ సందీశ్ భాటియా అర్షద్ వార్సి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం చాలా సరదగా సాగింది. చివరి సారిగా మీరు చూసిన చెత్త సినిమా ఏమిటని అడిగాడు. కల్కి సినిమా అని అర్షద్ వార్సి సమాధానమిచ్చాడు.
‘నేను కల్కి సినిమా చూశాను. నాకు అస్సలు నచ్చలేదు. సినిమా చూస్తున్నంత సేపు చాలా కష్టంగా తోచింది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆయన నటనను మనం ఊహించలేం. అమితాబ్ బచ్చన్‌ను నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేనేమో. నిజం చెబుతున్నా.. ఆయనలో ఉన్న శక్తిలో కొంతైనా నాకు ఉంటే నా లైఫే వేరేలా ఉండేది’ అని అర్షద్ చెప్పాడు.
Also Read: Kolkata Incident: కోల్‌కతా హత్యాచార కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టు విచారణ
ఇక ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్.. నాకు నిజంగా చాలా బాధేసింది. ఆయన ఈ సినిమాలో జోకర్‌లా ఉన్నాడు. ఎందుకు? నేను మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకున్నా. ఒక మేల్ గిబ్స్‌ను ఆయన పాత్రలో చూడాలనుకున్నా. కానీ, మీరు ప్రభాస్‌ను అలా ఎలా చేశారు. ఇలాంటివన్ని మీరు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ పై ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే.. సినిమాలో ఆయనను ఓ జోకర్‌లా చూపించారని అర్షద్ బాధపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Here it is, The real view of #Kalki2898AD from north India. #Prabhas looks like Joker in the film says Arshad. He also added kalki could have been a good film like Mad Max but the actor and director failed to do so.
https://t.co/hbEWMOyyj7— Movie Hub (@Its_Movieshub) August 18, 2024
గోల్ మాల్ స్టార్ అర్షద్ వార్సి మున్నాభాయ్ ఎంబీబీఎస్(తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్), లగే రహో మున్నాబాయ్(తెలుగులో శంకర్ దాదా జిందాబాద్) సినిమాల్లో సంజయ్ దత్ పక్కన నటించి తన హాస్యంతో చాలా మందిని నవ్వించాడు.
ఈ ఏడాది పెద్ద హిట్‌లలో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
ఇదిలా ఉండగా.. అర్షద్ వార్సి తనకు నచ్చిన సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు. తాను శ్రీకాంత్ సినిమా చూశానని, ఆ సినిమా తనకు చాలా నచ్చిందని వివరించాడు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు పర్ఫార్మెన్స్ ఔట్‌స్టాండింగ్ అని కితాబిచ్చాడు. శ్రీకాంత్ బొల్ల జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీశారు. రాజ్ కుమార్ రావు ఇందులో అంధుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.