టెక్కీలకు ఊహించని షాక్ ఇచ్చింది ఐబీఎం కంపెనీ. తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు వర్క్ వీసాలు, గ్రీన్ కార్డ్‌లను స్పాన్సర్ చేయడాన్ని నిలిపి వేయాలని డిసైడ్ అయ్యింది. దీని కారణంగా ప్రభావితమైన ఉద్యోగులు ఈ ఏడాది చివరినాటికి అంటే డిసెంబర్ 31 కంపెనీని విడిచి పెట్టాలని, లేకుంటే మరొక దేశానికి వెళ్లి పని చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు ఏం తేల్చుకోవాలన్న దానిపై సందిగ్ధంలో పడ్డారు.
అమెరికాలోని ఐబిఎం కంపెనీ.. విదేశీ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 1,50,000 ఉద్యోగులకు యూఎస్ వర్క్ వీసాలు, గ్రీన్ కార్డ్‌లను స్పాన్సర్ చేయడాన్ని నిలిపి వేసింది. ఈ నిర్ణయం కారణంగా ప్రభావితమైన ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. మరొక దేశానికి వెళ్లి పని చేయడం, లేకుంటే డిసెంబర్ 31 కంపెనీని వీడాలని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చింది. కంపెనీ నిర్ణయంపై సమాధానం ఇవ్వడానికి ఉద్యోగులకు 3 వారాల గడువు ఇచ్చింది.
మరొక దేశంలో పని చేయడానికి అంగీకరించని వారికి మూడునెలల జీతం ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగిస్తారు. వారికి డిసెంబరు 31 చివరి వర్కింగ్ డేగా కానుంది. ఆ కంపెనీలోని ఎంతమంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అనేది ఇంకా తెలియరాలేదు. ఇంకా ఎంతమంది అమెరికాలో ఉండి పని చేయవచ్చు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. వర్క్ వీసాలు, గ్రీన్‌కార్డుల కోసం విదేశీ నిపుణులు తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీ మీద ఆధారపడతారు. దీంతో టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది భారతీయులు భవిష్యత్ అనిశ్చితిలో పడింది.
ALSO READ: ఈక్విటీ, బంగారం, డెట్… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పదవీకాలంలో వలస విధానాలను కఠినతరం చేశారు. దీంతో ఐబీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IBM తన నిర్ణయానికి అమెరికా ప్రభుత్వ చర్యలు కారణమని ఎక్కడా పేర్కొనలేదు. అందుకు బదులుగా మారుతున్న క్లయింట్ అవసరాలు, నైపుణ్యం గల కార్మికుల లభ్యతను కారణంగా చూపినట్లు సమాచారం.