E-Paper
Advertisement

20 సంవత్సరాలలో 2 కోట్లు సంపాదించాలంటే ప్రతి నెలా ఎంత SIP చేయాలి ?

20 సంవత్సరాలలో 2 కోట్లు సంపాదించాలంటే ప్రతి నెలా ఎంత SIP చేయాలి ?
Advertisement

SIP Investment: చాలామంది యువత ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే జీతంతో ఖర్చులు, సరదాలు, షాపింగ్ అంటూ రోజులు గడిపేస్తుంటారు. నెలాఖరులో మిగిలిన డబ్బును పొదుపు చేద్దామనుకుంటారు. అయితే ఏదో ఒక ఖర్చు రావడంతో చేతిలో డబ్బు మిగలదు. చిన్న వయసులోనే పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవచ్చు. నెలకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. మన ఆదాయానికి తగ్గట్టుగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా పెట్టుబడిగా పెడుతూ వెళ్తే, కాలక్రమేణా అది పెద్ద మొత్తంగా మారుతుంది. ముఖ్యంగా జెన్‌-జెడ్ యువతకు ఇప్పటి నుంచే పెట్టుబడులు ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి ప్రయోజనం ఉంటుంది. నెలకు సుమారు రూ.20 వేల చొప్పున 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, ఏడాదికి సగటున 12 శాతం రాబడి వచ్చినప్పుడు దాదాపు రూ.2 కోట్ల మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి పెట్టుబడులు ఎంచుకోవాలి? రిస్క్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా పెట్టుబడి మొదలుపెడితేనే ఎక్కువ ప్రయోజనం

రూ.2 కోట్ల నిధిని సమకూర్చుకోవాలంటే ముందుగా ఎంత కాలంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ సమయం చాలా కీలకం. ఎందుకంటే పెట్టుబడికి ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు చక్రవడ్డీ ప్రయోజనం కూడా పెరుగుతుంది. అంటే మనం పెట్టిన అసలు డబ్బుపైనే కాకుండా, వచ్చిన రాబడిపైనా మళ్లీ రాబడి పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

ఉదాహరణకు నెలకు సుమారు రూ.20,000 చొప్పున 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, ఏడాదికి సగటున 12 శాతం రాబడి వచ్చినప్పుడు దాదాపు రూ.2 కోట్ల నిధి సమకూరుతుంది. ఈ కాలంలో మీరు పెట్టే అసలు పెట్టుబడి సుమారు రూ.48.48 లక్షలు మాత్రమే. మిగిలిన మొత్తం పెట్టుబడిపై వచ్చిన రాబడి వల్ల సమకూరుతుంది. అయితే 12 శాతం రాబడి అనేది కేవలం అంచనా మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడులు మారుతుంటాయి.

ఈక్విటీ, డెట్, హైబ్రిడ్.. మూడింటి కలయిక మంచిదేనా?

దీర్ఘకాలంలో ఇంత మొత్తాన్ని పెంచుకోవడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఉపయోగపడవచ్చు. ఇవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కాబట్టి మార్కెట్ పెరిగినప్పుడు మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడి విలువ కూడా తగ్గవచ్చు. అందుకే మొత్తం డబ్బును ఈక్విటీలోనే పెట్టకుండా ఇతర పెట్టుబడి సాధనాలను కూడా ఎంచుకోవాలి.

Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), పీపీఎఫ్ (PPF), డెట్ ఫండ్లు వంటివి  సురక్షితమైన పెట్టుబడుల కిందకు వస్తాయి. ఇవి మన డబ్బుకు పూర్తి భద్రతను, స్థిరమైన రాబడిని ఇస్తాయి. అయితే స్టాక్ మార్కెట్ (ఈక్విటీ) తో పోలిస్తే వీటిలో లాభాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక హైబ్రిడ్ ఫండ్లు అంటే.. మీ డబ్బును కొంత స్టాక్ మార్కెట్‌లో, మరికొంత సురక్షితమైన డెట్ ఫండ్లలో కలిపి పెట్టుబడి పెట్టే విధానం. దీనివల్ల ఎక్కువ నష్టభయం లేకుండా, మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మూడు రకాల పెట్టుబడుల్లో దేనిలో ఎంత డబ్బు పెట్టాలి అనేది మీ వయసు, భవిష్యత్ అవసరాలు, నష్టాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.

SIPతో పెట్టుబడులు.. మధ్యమధ్యలో సమీక్ష

ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెలా ఆటోమేటిక్‌గా డబ్బు పెట్టుబడికి వెళ్లేలా ఏర్పాటు చేసుకుంటే, పొదుపులో క్రమశిక్షణ పెరుగుతుంది. మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు, ధరలు పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనినే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు.

అయితే ఒకసారి పెట్టుబడి పెట్టి వదిలేయడం సరిపోదు. కనీసం ఏడాదికి ఒకసారి మీ పెట్టుబడులను పరిశీలించాలి. ఈక్విటీ, డెట్ మధ్య మీరు నిర్ణయించుకున్న పెట్టుబడి నిష్పత్తిలో మార్పులు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి మళ్లీ సర్దుబాటు చేసుకోవాలి. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి పెట్టుబడులు ఆపేయడం, మార్కెట్ పెరిగినప్పుడు అత్యాశతో ఎక్కువ మొత్తాలు పెట్టడం వంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. రూ.2 కోట్లు కూడబెట్టాలంటే ప్రతి నెలా కొంత డబ్బు పెట్టుబడి పెట్టడంతో పాటు ఓపికగా ఉండాలి. మధ్యలో మార్కెట్ పడిపోయిందని భయపడి పెట్టుబడులు ఆపేయకూడదు. అయితే ఏడాదికి 10 నుంచి 12 శాతం లాభం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కొన్నేళ్లు ఎక్కువ రావచ్చు.. మరికొన్నేళ్లు తక్కువ రావచ్చు. మనం పెట్టిన డబ్బు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టి, తొందరపడకుండా దీర్ఘకాలం కొనసాగించాలి. అప్పుడే భవిష్యత్తులో మంచి మొత్తాన్ని కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది.

Read Also: 5 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా వడ్డీ… ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా ?

Related News

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు.. అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్కీమ్స్ ఇవే!

రూ. 30 వేలు ఆదాయం.. కష్టపడకుండా ప్రతీ నెలా, ఇంతకీ ఏం చెయ్యాలో తెలుసా?

ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకు వాళ్లను ఈ 5 ప్రశ్నలు కచ్చితంగా అడగండి!

డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు మొదలు ఆధార్ వరకు, ఇంకా ఏంటంటే..

నటనలో రజనీకాంత్ మనవడు.. టెక్నాలజీలో సీఈఓ.. ఆశ్చర్యపరుస్తున్న 13 ఏళ్ల రిత్విక్!

Big Stories

Advertisement
×