E-Paper
Advertisement

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?
Advertisement

Lab Grown Gold: బంగారం ధరలు పెరిగినప్పుడల్లా కొత్తగా కొనాలంటేనే సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనాలంటేనే భయపడే పరిస్థితి కూడా వస్తోంది. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో కొత్తగా నగలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి సమయంలో బంగారాన్ని భూమిలో నుంచి తవ్వకుండానే ప్రయోగశాలలో తయారు చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రయోగాల్లో సీసం, పాదరసం వంటి లోహాల నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రయత్నాలు చేశారు. దీంతో త్వరలోనే ల్యాబ్‌లో తయారైన బంగారం మార్కెట్లోకి వస్తుందనే చర్చ మొదలైంది. అసలు ఈ బంగారం ఎలా తయారవుతుంది? మనం కొనే బంగారం కంటే దీని ధర తక్కువగా ఉంటుందా? బంగారం కొనేవారికి దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం కొనే బంగారం భూమిలోని గనుల నుంచి తవ్వి తీస్తారు. పాత బంగారాన్ని కరిగించి మళ్లీ ఉపయోగించడం కూడా చేస్తారు. కానీ ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ప్రయోగశాలలోనే ఇతర మూలకాలను బంగారంగా మార్చడం. దీనికి శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతి పేరు ‘న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యూటేషన్’. అంటే ఒక పదార్థంలోని అణువు కేంద్రకంలో మార్పులు చేసి, దాన్ని మరో మూలకంగా మార్చడం. ఉదాహరణకు సీసం లేదా పాదరసం వంటి లోహాలను ప్రత్యేక అణు ప్రక్రియల ద్వారా బంగారంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఇది ల్యాబ్‌లో తయ్యారు చేసే వజ్రాల మాదిరిగా కాదు. వజ్రాలను తయారు చేయడానికి కార్బన్‌పై ప్రత్యేక ఒత్తిడి, ఉష్ణోగ్రత వంటి పరిస్థితులు కల్పిస్తారు. అయితే బంగారం తయారు చేయాలంటే అణువు కేంద్రకంలోనే మార్పు రావాలి. అందుకే దీనికి అత్యాధునిక అణు పరికరాలు అవసరం. ఇలా తయారైన బంగారం కూడా సహజంగా లభించే బంగారంలాగే రసాయన లక్షణాలు కలిగి ఉంటుంది.

సీసం నుంచి బంగారం

2025లో స్విట్జర్లాండ్‌లోని CERN శాస్త్రవేత్తలు తమ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) ప్రయోగాల్లో సీసం అణువులను బంగారు అణువులుగా మార్చిన విషయాన్ని వెల్లడించారు. 2015 నుంచి 2018 మధ్య జరిగిన ప్రయోగాల్లో మొత్తం సుమారు 29 పికోగ్రాముల బంగారం ఏర్పడినట్లు గుర్తించారు. ఒక పికోగ్రాము అంటే గ్రాములో లక్ష కోట్లలో ఒక వంతు. అంటే తయారైన బంగారం పరిమాణం ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ బంగారు అణువులు కొద్ది క్షణాల్లోనే విచ్ఛిన్నమయ్యాయి. కాబట్టి వాటిని సేకరించి ఆభరణాలు తయారు చేసే పరిస్థితి లేదు.

మారథాన్ ఫ్యూజన్ ప్రకటనతో మళ్లీ చర్చ

Advertisement

2026 అక్టోబర్‌లో అమెరికాకు చెందిన మారథాన్ ఫ్యూజన్ సంస్థ పాదరసాన్ని బంగారంగా మార్చినట్లు ప్రకటించింది. అణు ఫ్యూజన్ ప్రక్రియలో వచ్చే న్యూట్రాన్ల సాయంతో పాదరసంలోని ఒక రకమైన అణువును మరో రూపంలోకి మార్చి బంగారాన్ని పొందినట్లు సంస్థ తెలిపింది. తమ పద్ధతి CERN ప్రయోగంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ వేగంతో బంగారం ఉత్పత్తి చేయగలదని కూడా పేర్కొంది. అయితే ఎంత బంగారం తయారైంది? దానికి ఎంత ఖర్చయింది? అనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ ఫలితాలను ఇతర శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించలేదు. అందుకే ప్రస్తుతానికి దీన్ని నిర్ధారిత విజయంగా కాకుండా సంస్థ చేసిన ప్రకటనగానే చూడాలి.

2027లో బంగారు దుకాణాల్లో దొరుకుతుందా?

ప్రయోగశాలలో బంగారాన్ని తయారు చేయడం ఒక ఎత్తయితే, దాన్ని పెద్ద మొత్తంలో తయారు చేసి మార్కెట్లో అమ్మడం మరో ఎత్తు. ఇందుకు భారీ ఖర్చుతో కూడిన అణు పరికరాలు, ప్రత్యేక సౌకర్యాలు అవసరం. ఉత్పత్తి అయిన బంగారాన్ని సురక్షితంగా వేరు చేసి, దాని నాణ్యతను కూడా పరీక్షించాలి. ఇవన్నీ తక్కువ ఖర్చుతో చేయగలిగితేనే వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. అందుకే 2027లోనే బంగారు దుకాణాల్లో ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అందుబాటులోకి వస్తుందని ఇప్పుడే చెప్పలేం.

భవిష్యత్తులో ఈ ప్రయోగం విజయవంతమై తక్కువ ఖర్చుతో ఎక్కువ బంగారాన్ని తయారు చేయగలిగితే, ప్రపంచ బంగారం సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మనం కొనే బంగారం ధరలు తగ్గిపోతాయని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రయోగాలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

Read Also: 5 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా వడ్డీ… ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా ?

Related News

స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు.. అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్కీమ్స్ ఇవే!

రూ. 30 వేలు ఆదాయం.. కష్టపడకుండా ప్రతీ నెలా, ఇంతకీ ఏం చెయ్యాలో తెలుసా?

ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకు వాళ్లను ఈ 5 ప్రశ్నలు కచ్చితంగా అడగండి!

డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు మొదలు ఆధార్ వరకు, ఇంకా ఏంటంటే..

నటనలో రజనీకాంత్ మనవడు.. టెక్నాలజీలో సీఈఓ.. ఆశ్చర్యపరుస్తున్న 13 ఏళ్ల రిత్విక్!

అంచనాలు తారుమారు.. ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధర, కొనుగోలుదారులకు షాక్

Big Stories

Advertisement
×