E-Paper
Advertisement

Advertisement

Karthika Deepam 2 serial today Episode: హాస్పిటల్ నుంచి సూరజ్‌ను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి తీసుకెళ్తుంది మాలిని. సూరజ్‌ వెనకాలే మాలిని ఇంటికి వెళ్తారు కార్తీక్‌, దీప, జ్యోత్స్న. వాళ్లను చూసిన మాలిని కోపంగా మాట్లాడుతూనే వెటకారంగా గౌరిని పిలిచి కార్తీక్‌, దీప, జ్యోత్స్నలకు కాఫీ ఇవ్వమని చెప్తుంది. అందుకు గౌరి తాను సూరజ్‌కు జ్యూస్‌ తీసుకెళ్తున్నానని అది ఇచ్చి వచ్చాక వాళ్లకు కాఫీ ఇస్తాను అంటూ వెళ్లబోతుంటే..

గౌరిని కార్తీక్‌ ఆపేసి చేతిలోని జ్యూస్‌ తీసుకుని జ్యోత్స్నకు ఇస్తాడు. ఈ జ్యూస్‌ సూరజ్ కు జ్యోత్స్న ఇస్తుంది. ఇప్పుడు నువ్వెళ్లి మాకు కాఫీ తీసుకురా అంటాడు. జ్యోత్స్నను జ్యూస్‌ తీసుకుని వెళ్లి సూరజ్‌కు ఇచ్చి తాగిన తర్వాత సూరజ్‌ను తీసుకుని కిందకు రమ్మని చెప్తాడు కార్తీక్‌. కార్తీక్‌ మాటలకు మాలిని కోప్పడుతుంది. ఇదేంటి నా కొడుక్కి జ్యూస్‌ తీసుకెళ్లం ఏంటి..? అని అడిగితే.. జ్యోత్స్న సూరజ్‌కు పీఏ.. పీఏ అన్న తర్వాత ఆ మాత్రం చేయాలిలే చేయోచ్చు కూడా నువ్వు వెళ్లు జ్యోత్స్న అంటూ కార్తీక్‌ పంపిస్తాడు.

Advertisement

జ్యూస్‌ తీసుకెళ్లిన జ్యోత్స్న సూరజ్‌కు ఇవ్వబోతుంటే.. సూరజ్‌ లేచి తీసుకోబోతుంటే.. తూలి కిందపడబోతాడు. జ్యోత్స్న పట్టుకుంటుంది. జ్యోత్స్న చేతిలోని జ్యూస్‌ గ్లాస్‌ కింద పడి పగిలిపోతుంది. ఏదైనా మనం ఇవ్వాలనుకున్నవి ఇలాగే చేయి జారిపోతుంటాయి అంటాడు సూరజ్. ఏం ఇవ్వాలనుకున్నావు.. ఎవరికి ఇవ్వాలనుకున్నావు.. అయినా నా మీద నింద పడింది. ఆ నింద నిజమని నమ్మావు.. నన్ను ద్వేషిస్తున్నావు అనుకున్నాను కానీ ఇలా ప్రాణాలకు తెగించి ఎందుకు కాపాడావు  సరే అదేదో జరిగిపోయింది అనుకుంటే కళ్లు తెరవగానే నా పేరే ఎందుకు పలవరించావు.. నీకు ఇష్టం లేని మనిషి చస్తే నీకేంటి..? బతికితే నీకేంటి..? అంటూ జ్యోత్స్న అడిగితే..

సూరజ్‌ కోపంగా చూస్తూ.. నీ ప్రేమను రెండు కోట్లకు అమ్మేసుకున్నావు కదా నేను అది తట్టుకోలేకపోతున్నాను ఆ విషయమే నాకు గుండెల్లోకి దిగిపోయింది. క్యారెక్టర్‌ ఉన్నవాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు క్యారెక్టర్‌ లేదు కదా అంటాడు సూరజ్‌. అందుకు జ్యోత్స్న బాధపడుతూ నీ మాటలు కింద పడి పగిలిపోయిన ఈ గ్లాస్‌ కంటే ఎక్కువ నా మనసును ముక్కలు చేశాయి. అయినా నీ చేతలు వేరేగా ఉంటాయి. నీ మాటలు వేరేగా ఉంటాయి. సరేలే కింద నీకోసం వెయిట్‌ చేస్తున్నారు వెళ్దాం పద అంటూ సూరజ్‌ను తీసుకుని కిందకు వెళ్తుంది జ్యోత్స్న.

Advertisement

సూరజ్‌ ను పలకరించేందుకు శివనారాయణ, దశరథ, సుమిత్ర వచ్చి ఉంటారు. అందరూ సూరజ్‌ను ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంటారు. మాలిని కల్పించుకుని మీ మనవరాలికి తగలాల్సింది నా కొడుకుకి తగిలింది అయినా నేను జ్యోత్స్నకు రుణపడి ఉంటాను. వాడెవడో బ్లడ్‌ ఇవ్వడానికి 25 లక్షలు అడిగితే జ్యోత్స్న వెంటనే డబ్బులు ఇచ్చి రక్తం ఇచ్చేలా చేసిందట. అందుకైనా జ్యోత్న్సకు నేను రుణపడి ఉంటాను అంటూ మాలిని చెప్పగానే.. ఏంటి ఇరవై అయిదు లక్షలా జ్యోత్స్న ఇచ్చిందా అంటూ అందరూ షాక్‌ అవుతారు.

ఏంటి జ్యోత్స్న నువ్వు అంత డబ్బు కట్టావా..? అని సుమిత్ర అడిగితే నిజమే మమ్మీ నేనే కట్టాను అని జ్యోత్స్న చెప్తుంది. అంత డబ్బు నీకెక్కడిది అంటూ శివనారాయణ కోపంగా అడిగితే మీకు తెలియదా బాబాయ్‌ జ్యోత్స్న రెండు కోట్లకు తన ప్రేమను అమ్మేసుకుంది మాకు. ఆ రెండు కోట్లు నేనే వేశాను జ్యోత్స్న అకౌంట్‌లో అని మాలిని చెప్పగానే.. శివనారాయణ షాక్‌ అవుతాడు. కోపంగా తిడుతుంటే.. దక్షిణమూర్తి హేళనగా మాట్లాడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కార్తీక్‌ అడ్డుగా వెళ్లి జ్యోత్స్న నిజంగానే డబ్బులు తీసుకుంది అని చెప్తాడు. ఒక రాయబారి వల్ల ఈ బేరం జరిగింది అంటూ చెప్తాడు. అందరూ షాక్‌ అయిపోతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఎంట్రీతో పార్వతి టెన్షన్.. రమ్య కిడ్నాప్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : అయ్యో పాపం చక్రీ.. మహా ప్లాన్ సక్సెస్.. విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్.

Nindu Noorella Saavasam Serial Today Episode November 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ రూంలోంచి డబ్బులు కొట్టేసిన మనోహరి 

Big Stories

Advertisement
×