E-Paper
Advertisement

ఈక్విటీ, బంగారం, డెట్‌… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?

ఈక్విటీ, బంగారం, డెట్‌… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?
Advertisement

Multi Asset Funds: చేతిలో రూ.10 లక్షలు ఉన్నాయనుకోండి..ఆ డబ్బును ఒకే చోట పెట్టుబడి పెట్టాలా? లేక కొంత షేర్లలో, మరికొంత బంగారంలో, ఇంకొంత మరేదైనా మంచి పథకాల్లో పెట్టాలా? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన డబ్బు పెరగాలి.. అదే సమయంలో మార్కెట్ పడిపోయినప్పుడు నష్టాలు ఎక్కువగా రాకూడదని కోరుకుంటారు. అందుకే ఈక్విటీ, బంగారం, డెట్ వంటి వేర్వేరు పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ మూడింటిలో విడివిడిగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గమైతే, వీటన్నింటిలోనూ పెట్టుబడి పెట్టే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం మరో మార్గం. మరి ఈ రెండింటిలో ఏది మంచిది? రూ.10 లక్షలను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

ఒకే ఫండ్‌లో మూడు రకాల పెట్టుబడులు

మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటే.. ఒకే మ్యూచువల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్ (ఈక్విటీ), సురక్షితమైన డెట్ ఫండ్లు, మరియు బంగారం వంటి కనీసం మూడు రకాల సాధనాల్లో డబ్బు పెట్టే అద్భుతమైన పథకం. సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఈ ఫండ్లు కనీసం మూడు విభాగాల్లో ఒక్కోదానిలో 10 శాతం చొప్పున పెట్టుబడి పెట్టాలి. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి వేటిలో ఎంత డబ్బు పెట్టాలి, ఎప్పుడు మార్పులు చేయాలి అనే బాధ్యతను ఫండ్ మేనేజరే చూసుకుంటారు. దీనివల్ల మనం విడివిడిగా వేర్వేరు ఫండ్లను ఎంచుకుని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన తలనొప్పి లేకుండా, ఒకే ఫండ్‌లో పెట్టుబడి పెడితే సరిపోతుంది.

రూ.10 లక్షలను ఇలా విభజించుకోవచ్చు

Advertisement

ఉదాహరణకు మీ దగ్గర రూ.10 లక్షలు ఉంటే, వాటిని మూడు భాగాలుగా విభజించి రూ.6 లక్షలు (60%) ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో, రూ.2 లక్షలు (20%) బంగారంలో, మరో రూ.2 లక్షలు (20%) సురక్షితమైన డెట్ పెట్టుబడుల్లో విడివిడిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ ఈ రూ.10 లక్షలను ఒకే మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టినా, అది కూడా ఇదే విధంగా వివిధ సాధనాల్లో డబ్బును విభజిస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది.. మనం విడివిడిగా పెట్టుబడి పెడితే ఏ విభాగంలో ఎంత డబ్బు ఉండాలనే కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, అదే ఒకే మల్టీ అసెట్ ఫండ్‌లో పెడితే ఆ నిర్ణయమంతా ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది.

మార్కెట్ మారితే పెట్టుబడుల్లోనూ మార్పులు అవసరమే!

మీరు ఈక్విటీలో 60 శాతం, బంగారంలో 20 శాతం, డెట్‌లో 20 శాతం పెట్టుబడి పెట్టారని అనుకుందాం. కొంతకాలానికి షేర్ మార్కెట్ బాగా పెరిగితే ఈక్విటీలో పెట్టిన డబ్బు విలువ కూడా పెరుగుతుంది. దీంతో మొత్తం పెట్టుబడిలో ఈక్విటీ వాటా 70 శాతానికి చేరవచ్చు. అప్పుడు మార్కెట్ పడిపోతే మీ పెట్టుబడిపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈక్విటీలో కొంత డబ్బును తగ్గించి, బంగారం లేదా డెట్‌లోకి మళ్లించాల్సి రావచ్చు. ఇలా ముందుగా నిర్ణయించుకున్న పెట్టుబడి నిష్పత్తిని మళ్లీ సరిచేయడాన్నే రీబ్యాలెన్సింగ్ అంటారు.

Advertisement

మల్టీ అసెట్ ఫండ్‌లో ఈ పనిని ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. విడివిడిగా పెట్టుబడి పెడితే మాత్రం ఎప్పుడు ఏ పెట్టుబడిని తగ్గించాలి, దేనిలో డబ్బు పెంచాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. దీనివల్ల పెట్టుబడులపై మనకు ఎక్కువ నియంత్రణ ఉంటుంది. అయితే రీబ్యాలెన్సింగ్ చేసినంత మాత్రాన లాభాలు పెరుగుతాయని హామీ లేదు.

పన్నులు, ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త

పెట్టుబడి పెట్టేటప్పుడు వచ్చే లాభాలతో పాటు పన్నులు, నిర్వహణ ఖర్చులను కూడా గమనించాలి. మల్టీ అసెట్ ఫండ్‌లో ఈక్విటీ, బంగారం, డెట్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఈక్విటీ ఫండ్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఉంటాయని అనుకోకూడదు. ఫండ్‌లో ఈక్విటీ పెట్టుబడుల వాటా ఎంత ఉందనే దాన్ని బట్టి పన్ను విధానం మారుతుంది. విడివిడిగా పెట్టుబడి పెడితే ఈక్విటీ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డెట్ ఫండ్లకు వేర్వేరు పన్ను నిబంధనలు వర్తించవచ్చు. అలాగే ప్రతి ఫండ్‌కు ఉండే నిర్వహణ ఖర్చులను కూడా ముందుగానే తెలుసుకోవాలి.

మరి ఏది ఎంచుకోవాలి? పెట్టుబడుల గురించి ఎక్కువగా తెలుసుకునే సమయం లేకపోతే మల్టీ అసెట్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. ఎందుకంటే పెట్టుబడుల మధ్య మార్పులు చేసే బాధ్యతను ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. అదే మీ డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు మార్చాలి అనే నిర్ణయాలు మీరే తీసుకోవాలనుకుంటే విడివిడిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఏ పద్ధతిని ఎంచుకున్నా ఫండ్ పనితీరు, రిస్క్, ఖర్చులు, పన్నుల వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడులను వేర్వేరు మార్గాల్లో మళ్లించడం వల్ల రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ నష్టాలు పూర్తిగా తప్పుతాయని మాత్రం చెప్పలేం.

Read Also: 5 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా వడ్డీ… ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా ?

Related News

PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?

10 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో కోటీశ్వరులు అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?

అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!

20 సంవత్సరాలలో 2 కోట్లు సంపాదించాలంటే ప్రతి నెలా ఎంత SIP చేయాలి ?

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు.. అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్కీమ్స్ ఇవే!

రూ. 30 వేలు ఆదాయం.. కష్టపడకుండా ప్రతీ నెలా, ఇంతకీ ఏం చెయ్యాలో తెలుసా?

Big Stories

Advertisement
×