E-Paper
Advertisement

Hatchback Sales Down: ఈ కార్లకు భారీగా తగ్గిన డిమాండ్.. కుప్పకూలిన సేల్స్!

Hatchback Sales Down: ఈ కార్లకు భారీగా తగ్గిన డిమాండ్.. కుప్పకూలిన సేల్స్!
Advertisement

Hatchback Sales Down: హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు జూన్ 2024లో క్షీణించాయి. గతేడాదితో పోలిస్తే 17.72 శాతం తగ్గాయి. అలానే ఇది గత నెల కంటే 2.06 శాతం తక్కువ. దేశంలో కస్టమర్లు ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. అయినప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇప్పటికీ ఆటోమొబైల్ రంగంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. జూన్‌ 2024లో 85,621 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే ఇది మే 2024లో విక్రయించిన 87,419 యూనిట్ల కంటే తక్కువ. జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌లో మారుతీ సుజికీకి చెందినవి ఉన్నాయి. ఈ క్రమంలో గత నెలలో జరిగిన హ్యాచ్‌బ్యాక్ వివరాలను తెలుసుకుందాం.

  • మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ దేశంలో ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ కారు. జూన్ 2023తో పోల్చితే అమ్మకాలలో 2.93 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ మే 2024తో పోలిస్తే 15.32 శాతం క్షీణించాయి.
  • మారుతీ సుజుకి బాలెనో జూన్ 2024లో అద్భుతమై సేల్స్ నమోదు చేసింది. జూన్ 2023తో పోలిస్తే అమ్మకాలలో 5.81 శాతం పెరుగుదల, మే 2024తో పోలిస్తే 5.99 శాతం పెరుగుదల ఉంది.
  • మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. జూన్ 2023తో పోలిస్తే అమ్మకాలలో 21.11 శాతం క్షీణత, మే 2024తో పోలిస్తే 4.84 శాతం క్షీణత ఉంది.
  • మారుతీ సుజుకీ ఆల్టో అమ్మకాలు 31.33 శాతం క్షీణించాయి. అయితే మే 2024తో పోలిస్తే అమ్మకాలు 1.30 శాతం పెరిగాయి.

Also Read: Best Bikes Under 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ సూపర్..!

  •  హ్యుందాయ్ ఐ20 విక్రయాలు 13.75 శాతం క్షీణించాయి. అయితే మే 2024తో పోలిస్తే అమ్మకాలలో 2.82 శాతం పెరుగుదల ఉంది.
  • టాటా టియాగో అమ్మకాలు 36.4 శాతం క్షీణించాయి. మే 2024తో పోలిస్తే అమ్మకాలలో 12.7 శాతం క్షీణత ఉంది.
  • హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS అమ్మకాలు కూడా 21.72 శాతం క్షీణించాయి. మే 2024తో పోలిస్తే అమ్మకాలలో 7.13 శాతం క్షీణత ఉంది.
  • టయోటా గ్లాంజా విక్రయాలు 18.78 శాతం పెరిగాయి. అయితే మే 2024తో పోల్చితే అమ్మకాలలో 8.83 శాతం క్షీణత ఉంది.
  • టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు 45.7 శాతం క్షీణించాయి. అయితే మే 2024తో పోలిస్తే అమ్మకాలలో 87.65 శాతం పెరుగుదల ఉంది. కొత్త ఆల్ట్రోజ్ రేసర్‌ను ప్రారంభించడం దీనికి కారణం కావచ్చు.
  • మారుతి సుజుకి సెలెరియో విక్రయాలు 12.18 శాతం క్షీణించాయి. మే 2024తో పోల్చితే అమ్మకాలలో 9.93 శాతం క్షీణత ఉంది.
Advertisement

Also Read: Jeetx Ze Electric scooter: తక్కువ ధరలో మరో కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 170 కి.మీ పక్కా..!

  • మారుతి సుజుకి ఇగ్నిస్ విక్రయాలు 40.15 శాతం క్షీణించాయి. అయితే మే 2024తో పోలిస్తే అమ్మకాల్లో 20.53 శాతం పెరుగుదల ఉంది.
  • మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో విక్రయాలు 40.68 శాతం క్షీణించాయి. మే 2024తో పోల్చితే అమ్మకాలలో 27.26 శాతం క్షీణత ఉంది.

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×