BigTV English

Jeetx Ze Electric scooter: తక్కువ ధరలో మరో కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 170 కి.మీ పక్కా..!

Jeetx Ze Electric scooter: తక్కువ ధరలో మరో కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 170 కి.మీ పక్కా..!

IVoomi – Jeetx Ze Electric Scooter: ఆటో మొబైల్ రంగం దినదినాన అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త వెహికల్స్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసి మంచి గుర్తింపు అందుకుంటున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా వాహన ప్రియులు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే క్రమంలో ఈవీ తయారీ కంపెనీలు తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు గల ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అందులో IVoomi Electric Scooter కంపెనీ ఒకటి.


వాహన ప్రియులకు బడ్జెట్ ధరలో కొత్త స్కూటర్లను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్ చేసిన స్కూటర్లు చాలా వరకు తక్కువ ధర, అధిక మైలేజీ ఇచ్చినవే ఉన్నాయి. అందులో JEETX లైనప్ ఒకటుంది. ఈ జీత్ లైనప్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో JEETX ZE ఒకటి. ఇది తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందిస్తుంది. ఈ స్కూటర్‌ని కంపెనీ 3 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ దేశీయ మార్కెట్‌లో ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సవాల్ విసురుతుంది.

ఇది రూ.99,999 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో మార్కెట్‌లో రిలీజ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 170 కి.మీ మైలేజీ అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ స్కూటర్ దేశీయ మార్కెట్‌లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. IVoomi Electric Scooter కంపెనీ ఈ JEETX ZE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.


Also Read: ఒక్క రూపాయి కట్టకుండానే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనేయొచ్చు.. సింగిల్ ఛార్జింగ్‌పై 150 కి.మీ మైలేజీ!

ఈ JEETX ZE ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారత మార్కెట్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మొబైల్ యాప్ కనెక్టివిటీతో స్మార్ట్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు, స్క్రీన్‌లో కాల్స్ వంటి నోటిఫికేషన్‌లను చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎస్‌ఓసీ అలర్ట్స్, ట్రావెల్ డేటాతో సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇది గంటకు 63 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 75ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ని కూడా కలిగి ఉంది.

కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇకో, రైడర్, స్పీడ్ వంటి మూడు రైడింగ్ మోడ్‌ ఆప్షన్లను కలిగి ఉంది. ఎకో మోడ్‌ 170 కి.మీ మైలేజీ, రైడర్ మోడ్ 140 కి.మీ మైలేజీ, స్పీడ్ మోడ్ 130 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లలో కానీ, ధర విషయంలో కానీ ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీగా నిలుస్తుంది. ఇక జూలై ఆఖరిలో లేదా ఆగష్టు నెలాఖరులో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు దేశంలో ప్రారంభం అవుతాయి.

Tags

Related News

BSNL Best Plan: రూ.225 ప్లాన్‌లో దుమ్మురేపే ఆఫర్లు.. డేటా, కాల్స్, SMSలతో ఫుల్ ఎంజాయ్

WiFi Calling: షాకింగ్ ట్రిక్..! మీ ఫోన్‌లోనే దాగి ఉన్న వైఫై కాలింగ్ ఫీచర్ గురించి తెలుసా?

EPFO Withdraw: ఈపీఎఫ్ఓ ​పొదుపును ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారా?.. అకాల విత్ డ్రాపై ఛార్జీల గురించి తెలుసా?

RBI new rules 2025: RBI షాకింగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుంచి మీ బ్యాంక్ ఖాతాలో ఇవన్నీ తప్పనిసరి!

BSNL Offers: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌లకు షాక్.. BSNL రూ.485లో 72 రోజుల మాస్ ఆఫర్

Jio Offers: 3 నెలల ప్యాక్ ఇంత చౌకా? జియో వినియోగదారులకి గుడ్ న్యూస్

Amazon Prime 2025: అమెజాన్ ప్రైమ్ ఫెస్టివల్ డీల్.. రూ.399 నుండి రూ.1499 వరకు డిస్కౌంట్లు, ఏది బెస్ట్?

TVS Bikes Price Cut: బైక్స్, స్కూటర్ల ధరలు తగ్గించిన టీవీఎస్.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×