BigTV English

Middle Class Budget Bikes: మిడిల్ క్లాస్ బైక్స్.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ.. ఇలాంటివే కదా మనకు కావాల్సింది..!

Middle Class Budget Bikes: మిడిల్ క్లాస్ బైక్స్.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ.. ఇలాంటివే కదా మనకు కావాల్సింది..!

Middle Class Budget Bikes Under Rs 1 Lakh: ప్రస్తుతం మార్కెట్‌లో ఆటో మొబైల్ రంగానికి డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. వాహన ప్రియులు ఎక్కువగా బడ్జెట్ వెహికల్స్, అండ్ అధిక మైలేజీ ఇచ్చే వాహనాలపైనే ఫోకస్ పెడుతున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ అందించే వాహనాలను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇందులో సామాన్యులు తమ బడ్జెట్‌లో అధిక మైలేజీ ఇచ్చే బైక్‌ల కోసం తరచూ సెర్చ్ చేస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి బైక్ కోసం ఎదురుచూస్తుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.


స్ప్లెండర్ ప్లస్

ప్రముఖ బైక్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ బైక్‌‌లు మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయంటే వాహనప్రియులు కొనేందుకు ముందుంటారు. ఈ కంపెనీ వెహికల్స్‌లో అత్యంత క్రేజ్ ఉన్న బైక్ స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తుంది. సామాన్యులు బైక్ కొనుక్కోవాలనుకుంటే ముందుగా దీనినే ఎంపిక చేసుకుంటారు.


ఎందుకంటే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు చాలా దూరం ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఈ బైక్ రూ.76,356 నుంచి రూ.77,826 ధర మధ్య ఉంటుంది. ఈ బైక్‌లో 97.2 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు దాదాపు 80.6 కి.మీ మైలేజీ అందిస్తుంది.

Also Read: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ లాంచ్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..!

హోండా షైన్ 100

ఆటో మొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌ల జాబితాలో హోండా షైన్ 100 ఉంది. ఇది రూ.66,600 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. ఈ బైక్‌లో 98.98 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.38 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో కూడా 4 స్పీడ్ గేర్ బాక్స్‌ సిస్టమ్ ఉంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌తో 68 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనికి డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌ కూడా అందించారు.

ఫ్రీడమ్ 125

ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ బజాజ్ ఇటీవల ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఇది సీఎన్‌జీ అండ్ పెట్రోల్ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ సీఎన్‌జీ బైక్‌ కోసం యావత్ వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. దీనిని కేవలం రూ.95000 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు.

గరిష్ట వేరియంట్ ధర రూ.1.10 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఇది 125 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉంటుంది. కాగా ఈ బైక్ కిలో సీఎన్‌జీకి 200 కి.మీ మైలేజీ, పెట్రోల్ మోడ్‌లో 130 కి.మీ మైలేజీ అందిస్తుంది. మొత్తంగా ఇది 330 కి.మీ మైలేజీ అందిస్తుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లు, మైలేజీ కలిగిన బైక్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇవే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×