BigTV English

Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. మల్టీపుల్ ఫ్య్రాక్చర్స్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన హీరో

Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. మల్టీపుల్ ఫ్య్రాక్చర్స్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన హీరో

Naveen Polishetty: ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి పలు హిట్ సినిమాలతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఒక చిన్న సినిమాగా వచ్చి ఎవరూ ఊహించని రెస్పాన్స్ క్రియేట్ చేసింది.


ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి సినీ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించి అదరగొట్టారు. మంచి అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టి దుమ్ము దులిపేసింది. దీంతో నవీన్ సినీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇలా వరుస పెట్టి సినిమాలు తీస్తూ తన అభిమానులకు ట్రీట్ అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత నవీన్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సహా మరో రెండు బ్యానర్ల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. వాటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ నవీన్ సినిమాలకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ బయటకు రాకపోవడంతో అతడికి ఏమైందన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇప్పుడు ఓ న్యూస్ బయటకొచ్చింది. నవీన్‌కు ఇటీవల అమెరికాలో ఓ భారీ యాక్సెడెంట్ అయిందని.. ఆ ప్రమాదంలో నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయని ఓ సమాచారం బయటకు వచ్చింది. కానీ దీనికి సంబంధించి నవీన్ అప్పుడు ఎలాంటి అఫీషియల్ అప్డేట్‌ ఇవ్వలేదు.


Also Read: బ్రేకింగ్: హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్.. చేతికి తీవ్ర గాయాలు..

అయితే ఇప్పుడు అతడికి సంబంధించి కొన్ని వార్తలు బయటకు రావడంతో ఎట్టకేలకు నవీన్ తన యాక్సెడెంట్‌పై స్పందించాడు. ఇందులో భాగంగా తన సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా ఓ నోట్‌ను పంచుకున్నాడు. తనకు తీవ్రంగా గాయాలయ్యాయని.. ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఈ మేరకు నవీన్ పోస్ట్ చేసిన నోట్‌ ప్రకారం..

‘‘ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్‌కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా ఇంజురీ అయ్యింది. నాకు ఇది చాలా టఫ్, పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్‌లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్‌గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్‌గా గడిచాయి. నేను కంప్లీట్‌గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్‌ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను.

కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్‌గా, హెల్తీగా కమ్‌బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. అయితే శుభవార్త ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్‌లో ఉన్న అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా తెరకెక్కబోతున్నాయి. నేను పూర్తిగా కోలుకున్నాక అప్‌కమింగ్ సినిమాల షూటింగ్ మొదలుపెడతాను. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంటే మోటివేషన్. మీ సపోర్ట్‌కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను స్క్రీన్ మీదకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఎప్పటిలాగే మీరు నా మీద ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×