Cumin Health Benefits: మన వంటింట్లో నిత్యం ఉపయోగించే జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీలకర్ర కేవలం వంటకాలకు రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి లాభాలు ఇస్తుంది. రక్తం మన శరీరానికి జీవనాధారం. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ, జీవకణాల సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. రక్తం తగినంతగా ఉత్పత్తి కాకపోతే మన శరీరంలో అనేక సమస్యలు కనిపిస్తాయి. రక్తం తగ్గిపోయినప్పుడు శరీరంలో అలసట ఎక్కువగా ఉండటం, శక్తి తగ్గిపోవడం, రక్తహీనతతో పాటు చర్మం కాంతి కోల్పోవడం వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇలాంటి సమస్యలకు సహజ పరిష్కారం జీలకర్ర నీళ్లు. చూడ టానికి చిన్నగా ఉన్న దీని నీటిని తాగితే ప్రయోజనాలు బోలెడు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ జీలకర్రను తగిన విధంగా తీసుకోవడం ద్వారా మన శరీరం బలంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జీలకర్రలోని విటమిన్లు, పోషకాలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత తగ్గించడంలో సహాయపడతాయి. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు రక్తాన్ని, కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు వాటికి మళ్లీ శక్తినిస్తాయి.
Also Read: Health Tips: అలసటగా అనిపిస్తోందా? ప్రధాన కారణాలివే !
తయారీ విధానం చాలా సులభం
ఒకటి లేదా రెండు స్పూన్ జీలకర్ర గింజలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టండి. ఉదయం లేవగానే మీరు బ్రెష్ చేసిన తరువాత నానబెట్టిన జీలకర్ర నీటిని తాగండి. మరొక విధానం రాత్రంతా నానబెట్టిన నీటిని స్టవ్ పై చిన్న మంటలో 5–10 నిమిషాలు ఉడికించి వడకట్టి తాగడం ద్వారా కూడా రక్తానికి, శరీరానికి లాభాలు లభిస్తాయి. ఈ విధంగా తీసుకోవడం వలన రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది. దీనివల్ల మీరు రోజంతా చాలా ప్రసాంతంగా గడిపే అవకాశం ఉంటుంది.
జీలకర్ర నీటితో చర్మం ప్రకాశవంతం
జీలకర్ర నీళ్లు కేవలం రక్తానికి మాత్రమే కాదు, శరీరంలోని జీవకణాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రక్తప్రసరణ సక్రమంగా ఉండటంతో శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీని ఫలితంగా శరీరం మొత్తం తాజా, ఉల్లాసంగా మారుతుంది, చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చర్మంలో ఉన్న నల్లటి మచ్చలు క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ప్రతి ఒక్కరికి ఉపయోగం
మహిళలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరు జీలకర్ర నీళ్లు ఉపయోగకరం. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడం వలన శరీరం బలంగా, మస్తిష్కం శక్తివంతంగా, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలసట తగ్గుతుంది. తలనొప్ప కూడా తగ్గిస్తుంది. శరీరం అలసట నుంచి ఉపశమనం ఉంటుంది. శరీరానికి మంచి ఉల్లాసంగా ఉండే విధంగా చేస్తుంది. జీలకర్రను ప్రతిరోజూ సరిగ్గా ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు పొందవచ్చు.