Suman Shetty : తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ విధితమే. నితిన్ నటించిన ఆ సినిమా హీరోగా నితిన్ ను కెరియర్లో నిలబెట్టేసింది. ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు సుమన్ శెట్టి. ఆ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలానే ఎన్నో తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7జీ బృందావన్ కాలనీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో రవి కృష్ణకు ఫ్రెండ్ గా నటించాడు సుమన్ శెట్టి. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అని ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా సుమన్ శెట్టి ప్రస్తావన వస్తే ఆ సినిమానే గుర్తుకు వస్తుంది.
కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఎన్నో సినిమాల్లో అతని కామెడీ చాలా మందికి కితకితలు పెట్టింది. ప్రస్తుతం జబర్దస్త్ షో కి జడ్జిగా చేస్తున్నారు. ఈ షోలో కూడా అతని వేసే సెటైర్లో విపరీతంగా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. స్వతహాగా రచయిత కూడా కావడంతో పంచులు సంచులు కొద్దీ అలవోకగా వస్తాయి. అయితే ఇదంతా కూడా నాణెం కు ఒకవైపు ఉన్నది.
సుమన్ శెట్టికి మరియు కృష్ణ భగవాన్ కి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్ సినిమా చేస్తున్న తరుణంలో, సుమన్ శెట్టి ఒక లాంగ్ లెన్త్ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఆపోజిట్ లో ఉన్న ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్.
అది లెన్త్ డైలాగ్ కావడంతో సుమన్ శెట్టి కరెక్ట్ గా చెప్పలేకపోయారు. దాదాపు నాలుగు నుంచి ఐదు టేక్స్ తీసుకున్నారు. అప్పుడు కృష్ణ భగవాన్ బాగా విసుక్కున్నారట. అప్పుడు దర్శకుడు శ్రీనివాసరెడ్డి వెళ్లి చాలా మంచి ఆర్టిస్ట్ అండి కొన్ని పదాలు నోరు తిరగటం లేదు బాగా చేస్తాడు అని సర్ది చెప్పారట.
అయితే సుమన్ శెట్టి దీని గురించి గతంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వడం వలన సుమన్ శెట్టి వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. మరోసారి ఈ గొడవ ప్రస్తావన బయటకు వచ్చింది. దీనిపై అప్పట్లో సుమన్ శెట్టి స్పందిస్తూ అతను సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి అలా రియాక్ట్ అయ్యారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆయన చేసిందేమీ తప్పులేదు అంటూ సుమన్ శెట్టి చెప్పాడు.
Also Read: Pawan Kalyan : వీడు పవన్ కళ్యాణ్ కు ఫ్రెండ్ కాదు ఫ్రాడ్, ఆ రచయితపై సోషల్ మీడియాలో మండిపాటు